సోనూ సూద్ కు కరోనా నెగెటివ్!
ఈరోజే ఓ మహిళను విమానంలో నాగపూర్ నుంచి హైదరాబాద్‌కు చేర్చిన సోనూసూద్ ఓ పాజిటివ్ న్యూస్ ప్రకటించారు. తనకు కరోనా టెస్ట్‌లో నెగెటివ్ వచ్చిందని ట్వీట్ చేస్తూ సింబల్‌ను చూపిస్తున్నాడు. ఇటీవలే ఆయన ఆచార్య సినిమా షూటింగ్ నిమిత్తం ఆరోజు హైదరాబాద్‌లోని కోకాపేటలో వర్షం పడుతున్నా ఆయన వానలో సైకిల్‌పై వెళ్ళారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆయన జ్వరంబారిన పడ్డారు. అనుమానం వచ్చి కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. దానితో ఆయన పూర్తిగా ఇంటి వద్దే విశ్రాంతి తీసుకున్నారు.
గతంలో కోవిడ్19 బారిన పడిన ఎంతోమందిని ఆదుకోవడమేకాకుండా వలస కూలీలను వారి వారి గమ్య స్తానాలకు చేర్చారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన్ను అభినందించారు. ఇక కోవిడ్ సెకండ్ వేవ్‌లో ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో అభిమానులు గందరగోళపడ్డారు. ఉత్తరాదిలో చాలా చోట్ల ఆయన కోలుకోవాలని పూజలు చేశారు. ఇక నెగెటివ్ రావడంతో వారంతా హ్యాపీగా వుంటారని చెప్పవచ్చు.