మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (19:33 IST)

ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు క్రియేటివ్ డైరెక్ట‌ర్

Pre-Release Event poster
హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. మార్చి 4న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా  విడుద‌ల‌కానుంది.
 
ఈ మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్ర‌వ‌రి 27(ఆదివారం) సాయంత్రం హైద‌రాబాద్‌లోని శిల్ప క‌ళా వేధిక‌లో వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, హీరోయిన్స్ కీర్తి సురేష్‌, సాయిప‌ల్ల‌వి హాజ‌రుకానున్నారు.
 
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సార‌థ్యంలో ఇప్ప‌టికే విడుద‌ల చేసిన అన్ని పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. .
 
కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ  వంటి సీనియ‌ర్ యాక్ట‌ర్స్‌ క‌లిసి న‌టిస్తుండ‌డం ఈ సినిమాలో మ‌రో విశేషం. సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు
 
సాంకేతిక బృందం
దర్శకత్వం: తిరుమల కిషోర్
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
సంగీతం, దేవీ శ్రీ ప్రసాద్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
కొరియోగ్రఫర్: దినేష్