గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (19:26 IST)

"ది కేరళ స్టోరీ"కి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ దక్కింది.. ఫిబ్రవరి 16న?

Adah Sharma
ఆదా శర్మ నటించిన "ది కేరళ స్టోరీ" చిత్రం, కేరళ మహిళలను బలవంతంగా ముస్లింలుగా మార్చడం, ఐఎస్ఐఎస్‌తో ప్రమేయం చుట్టూ ఉన్న నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. దీంతో ఈ సినిమా విడుదలకు ముందే వివాదాన్ని రేకెత్తించింది.
 
మే 5, 2023న విడుదలైన ఈ చిత్రం భారతదేశంలో 240 కోట్ల నికర వసూళ్లను సాధించి గణనీయమైన బాక్సాఫీస్ విజయాన్ని సాధించింది. థియేట్రికల్ విడుదల దృష్టిని ఆకర్షించినప్పటికీ, చిత్రం ఇంకా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు చేరుకోకపోవడంతో సినీ అభిమానుల్లో నిరాశను మిగిల్చింది. 
 
తాజాగా "ది కేరళ స్టోరీ" ఫిబ్రవరి 16న జీ5లో ఓటీటీ అరంగేట్రం చేయడానికి షెడ్యూల్ ఖరారైంది. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషలలో రానుంది.