శుక్రవారం, 18 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 27 జనవరి 2024 (17:40 IST)

భ్రమయుగం ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది

bhramayugam
bhramayugam
‘భ్రమయుగం’ ఫిబ్రవరి 15, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉందని తెలియజేయడం పట్ల నైట్ షిఫ్ట్ స్టూడియోస్ సంతోషంగా ఉంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
 
చిత్ర మలయాళ వెర్షన్ ఓవర్సీస్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూటర్ "ట్రూత్ గ్లోబల్ ఫిల్మ్స్" కాగా, చిత్ర కేరళ థియేట్రికల్ డిస్ట్రిబ్యూటర్ మిస్టర్ ఆంటో జోసెఫ్ యొక్క "AAN మెగా మీడియా". నైట్ షిఫ్ట్ స్టూడియోస్ జనవరి 26, 2024న అన్ని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేసిన సౌండ్‌ట్రాక్‌తో చలనచిత్ర మార్కెటింగ్ ప్రచారాన్ని చురుకుగా ప్రారంభించింది.
 
చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్ నిర్మిస్తున్న 'భ్రమయుగం’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా షెహనాద్ జలాల్, ప్రొడక్షన్ డిజైనర్‌గా జోతిష్ శంకర్, ఎడిటర్‌గా షఫీక్ మహమ్మద్ అలీ, సంగీత దర్శకుడిగా క్రిస్టో జేవియర్, మాటల రచయితగా టి.డి. రామకృష్ణన్ వ్యవహరిస్తున్నారు. మేకప్ బాధ్యతలు రోనెక్స్ జేవియర్, కాస్ట్యూమ్స్ బాధ్యతలు మెల్వీ జె నిర్వహిస్తున్నారు.
 
'భ్రమయుగం’ అనేది మమ్ముట్టి ప్రధాన పాత్రలో రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మక నిర్మితమవుతున్న మలయాళ చిత్రం. ఈ బ్యానర్ ప్రత్యేకంగా హారర్-థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడానికి ప్లాన్సృష్టించబడిన నిర్మాణ సంస్థ. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ మరియు వైనాట్ స్టూడియోస్ సమర్పిస్తున్న ‘భ్రమయుగం' భారీ స్థాయిలో చిత్రీకరించబడింది.