డియర్ అన్షు నువ్వు నాకు కూతురివే కాదు..
నటి రోజా ప్రస్తుతం మంత్రి పదవి రావడంతో బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరమై పూర్తిగా రాజకీయాలలో కొనసాగుతున్నారు. ఇలా సినిమాల పరంగా రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనకు ఏమాత్రం విరామ సమయం దొరికిన తన కుటుంబంతో గడపడానికి రోజా ఆసక్తి చూపుతారు.
ఈ క్రమంలోనే రోజా ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా వెకేషన్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియాలో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈమె అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా రోజా సోషల్ మీడియా వేదికగా తన కూతురు అన్షు మాలిక గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. అయితే తన కూతురు పుట్టిన రోజు కావడంతో తన కూతురు ఫోటోని షేర్ చేస్తున్న ఈమె తన గురించి ఒక ఎమోషనల్ నోట్ రాశారు.
ఈ సందర్భంగా రోజా పోస్ట్ చేస్తూ… "డియర్ అన్షు నువ్వు నాకు కూతురివే కాదు… నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్" అంటూ ఈమె తన కూతురు గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.