సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 21 డిశెంబరు 2020 (09:39 IST)

నాగవల్లికి కోపమొచ్చింది, బిగ్ బాస్ ఫినాలేకు అందుకే ఆలస్యంగా వచ్చిందా?

ఒక ప్రముఖ ఛానల్‌కు యాంకర్‌గా వ్యవహరిస్తున్న దేవి నాగవల్లికి బిగ్ బాస్ షోలో అవకాశం లభించిన విషయం తెలిసిందే. లేడీ బిగ్ బాస్ హౌస్ అవుతానని దేవి నాగవల్లి చెబుతూ వచ్చింది. అయితే ఉన్నట్లుండి 3వ వారంలో ఎలిమినేట్ అయిపోయింది దేవి నాగవల్లి.
 
ముందు నుంచి పక్కా కాన్ఫిడెన్స్‌తో హౌస్ లో కనిపించింది దేవి నాగవల్లి. చాలామంది సభ్యులు తప్పులు చేస్తూ బిగ్ బాస్ దగ్గర చీవాట్లు తిన్నారు. కానీ దేవి నాగవల్లి మాత్రం అలాంటి తప్పులు చేయలేదు. అందుకే ఆమె కాన్ఫిడెంట్‌గా ఉందంటూ హౌస్ లోని వాళ్ళే చెప్పారు. 
 
మొదట్లో దేవి నాగవల్లితో కలవాలని అనుకున్నా సభ్యులు మాత్రం కలవలేకపోయారు గానీ ఆమె బయటకు వెళితే మాత్రం అందరూ ఏడ్చారు. బయటకు వచ్చిన దేవి నాగవల్లి మాత్రం బిగ్ బాస్ షోలో కొంతమంది కంటెన్టెంట్లపై తన అక్కసును వెళ్ళగక్కింది. నేను హౌస్‌లో బాగా ఆడాను.
 
కానీ నన్ను ఎలిమినేట్ చేశారు. నాకు అభిమానులు మార్కులు ఎక్కువే వేశారు. ఎందుకు నన్ను ఎలిమినేట్ చేశారో అర్థం కావడం లేదు. తక్కువ మార్కులు వేసిన కంటెన్టెంట్లు మాత్రం హౌస్ లోనే ఉండిపోయారంటూ తన ఆవేదనను బయటకు వచ్చి వెళ్ళగక్కింది దేవీ నాగవల్లి. 
 
అసలు గ్రాండ్ ఫినాలే ముగింపు కార్యక్రమానికి వెళ్ళకూడదని మొదట్లో నిర్ణయించుకుందట దేవి నాగవల్లి. కానీ చివరకు యాజమాన్యం నుంచి పదే పదే ఫోన్లు రావడం.. అందరు కంటెన్టెంట్లు వచ్చినా దేవి నాగవల్లి రాకపోవడంతో ప్రచారం జరుగుతుందన్న ఉద్దేశంతో దగ్గరుండి హౌస్‌కు తీసుకువచ్చారట. 
 
కార్యక్రమం సగం పూర్తయిన తరువాత దేవి నాగవల్లి వచ్చి కూర్చున్నారు. అది కూడా ముభావంగా కూర్చుండి పోయారు. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ లేకుండా దేవి నాగవల్లి కనిపించింది.