ఆదివారం, 10 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 11 మార్చి 2022 (16:09 IST)

ఆది సాయికుమార్‌కు జోడీగా దిగంగన సూర్యవంశీ ఖ‌రారు

Adi Saikumar, Digangana Suryavanshi
ప్రముఖ నిర్మాత కెకె రాధామోహన్ ప్రస్తుతం టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో ఒక పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్‌లో 10వ‌ చిత్ర‌మిది. ఫణి కృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
 
కాగా,  ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన కథానాయికగా నటించడానికి నటి దిగంగనా సూర్యవంశీని ఖ‌రారు చేశారు. తెలుగు, హిందీ భాషలలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో న‌టిస్తున్న దిగంగన ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమాలో న‌టించ‌డం ప‌ట్ల చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్ష‌లు తెలుపుతోంది.
 
ఈ చిత్రంలో  ప్రతిభావంతులైన సాంకేతిక బృందం ప‌నిచేస్తోంది.. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల కెమెరా బాథ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ చిత్రానికి గిడుతూరి సత్య ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్‌ సమర్పిస్తున్నారు. కొలికపోగు రమేష్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌, ఫైట్స్‌ రామకృష్ణ చూసుకుంటున్నారు.
ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.