బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (13:13 IST)

ఆది సాయికుమార్ సీఎస్ఐ సనాతన్ ఫస్ట్ లుక్

Adi Saikumar CSI Sanatan First Look
చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సీఎస్ఐ సనాతన్". ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియ‌స్ ఐ) ఆఫీస‌ర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో  గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్ గా  రూపొందుతున్న "సీఎస్ఐ సనాతన్" సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.
 
ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఒక బిల్డింగ్ లో జరిగిన హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కోసం హీరో తన టీమ్ తో రావడం చూపించారు. క్రైమ్ జరిగిన ప్రాంతంలో పిస్టల్, కత్తి, కళ్లద్దాలు, ఫింగర్ ప్రింట్స్, బాడీ పడిఉన్న డ్రాయింగ్..ఇలా ఆధారాలు ఉన్నాయి. ఈ క్లూస్ తో నేరస్థులను  హీరో ఎలా పట్టుకోబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది
 
చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే  ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
న‌టీ న‌టులు - ఆదిసాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్,  తాక‌ర్ పొన్న‌ప్ప ,మ‌ధు సూద‌న్,  వసంతి తదితరులు 
 
సాంకేతిక వ‌ర్గం - ,  సినిమాటోగ్ర‌ఫీ ః జిశేఖ‌ర్, మ్యూజిక్: అనీష్ సోలోమాన్,  నిర్మాత ః అజ‌య్ శ్రీనివాస్, ద‌ర్శ‌కుడు ః శివ‌శంక‌ర్ దేవ్