శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Updated : శనివారం, 14 ఏప్రియల్ 2018 (12:11 IST)

దేవుడు లేడు.. దెయ్యాలే ఉన్నాయంటున్న ప్రియ‌ద‌ర్శ‌న్

ఎనిమిదేళ్ల బాలిక ఆసిఫా బానోపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. ప‌సి బాలికపై ఉన్మాదులు సాగించిన రాక్షసకాండ పట్ల దేశ‌వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఎనిమిదేళ్ల బాలిక ఆసిఫా బానోపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. ప‌సి బాలికపై ఉన్మాదులు సాగించిన రాక్షసకాండ పట్ల దేశ‌వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆసిఫాకు న్యాయం జరగాలి అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ (#JusticeforAsifa) పేరిట ఉద్యమం నడుస్తోంది.
 
ఈ ఉద్య‌మానికి సినీ ప్ర‌ముఖులు, విద్యావంతులు, జ‌ర్న‌లిస్టులు.. ఇలా చాలా మంది మాన‌వ‌తావాదులు స్పందిస్తున్నారు. ప్రముఖ సినీ దర్శకుడు ప్రియదర్శన్ సోషల్ మీడియా మాధ్యమంగా తీవ్రంగా స్పందిస్తూ.. దేవుడు అన్నీ చూసుకుంటాడు అని ఇక పై కూడా అనుకుంటారా? మీరే జాగ్రత్తగా ఉంటే మంచిది. 
 
ఎందుకంటే... ఆసిఫాను ఆలయంలో అత్యాచారం చేసి, హత్య చేశారు. ఆ సమయంలో మనమో, ఆ దేవుడో చిన్నారికి సహాయం చేయలేదు అంటూ తీవ్ర ఆవేదనతో ట్వీట్‌ చేశారు. దేవుడు లేడు.. కేవలం దెయ్యాలే ఉన్నాయి అంటూ ఆయన హ్యాష్‌ ట్యాగ్‌ ను కూడా జత చేశారు.