శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (12:24 IST)

ఓటీటీలోకి వచ్చేసిన విశ్వక్ సేన్ గామి..

gaami movie
విశ్వక్ సేన్ గామి ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రంలో విశ్వక్ అఘోరాగా అద్భుతంగా నటించాడు. ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్‌‌గా యాక్ట్ చేసింది. అభినయ, మహమ్మద్ సమద్, హారిక పెడద, శాంతి రావు, మయాంక్ పరాక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నరేష్ కుమారన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కార్తీక్ శబరీష్ నిర్మించారు.
 
విద్యాధర్ కగిత దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రానికి ఎక్కడ చూసినా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రం ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో తెలుగు, తమిళం, కన్నడ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ-5లో గామి అందుబాటులో ఉంది. థియేట్రికల్ రిలీజైన ఒక నెల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది.