బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 31 ఆగస్టు 2024 (15:55 IST)

ప్రణయ గోదారి నుంచి గు గు గ్గు.. అనే హుషారైన పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Pranaya Godari team with Ganesh Master
Pranaya Godari team with Ganesh Master
న్యూ కంటెంట్‌తో రిఫ్రెషింగ్‌ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం 'ప్రణయగోదారి'. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్‌. ఈ చిత్రంలో సదన్ హీరోగా, యాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది.
 
ప్రణయ గోదావరి గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియెన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా మరో పాటను మేకర్లు విడుదల చేశారు. గు గు గ్గు.. అంటూ సాగే ఈ హుషారైన పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ రిలీజ్ చేశారు. ఈ పాటకు మార్కండేయ బాణీ, సాహిత్యం స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. భార్గవి పిల్లై గాత్రం కుర్రకారుని కట్టి పడేసేలా ఉంది.
 
పాటను రిలీజ్ చేసిన అనంతరం గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘ప్రణయ గోదారి సినిమాలోని గు గు గ్గు... అనే ప్రత్యేక గీతాన్ని విడుదల చేశాను. పాట చాలా బాగుంది. హుక్ స్టెప్స్ బాగున్నాయి. ఈ మూవీని అందరూ ఆదరించాలి. విఘ్నేశ్ గారు తెరకెక్కించిన ప్రణయ గోదావరి పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
 
నటీనటులు : సదన్, ప్రియాంక ప్రసాద్, సాయికుమార్ తదితరులు