మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (09:13 IST)

నా తల్లిని వేశ్యగా మార్చారు... గంగూబాయి తనయుడు ఫైర్

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడి సినిమా వివాదంలో చిక్కుకునేలా వుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా గంగూబాయి కుమారుడు బాబూ రావుజీ షా మాట్లాడుతూ సినిమాపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. "నా తల్లిని వేశ్యగా మార్చారు. ప్రజలు ఇప్పుడు మా అమ్మ గురించి చెప్పలేని మాటలు మాట్లాడుతున్నారు" అని అన్నారు.
 
గంగూబాయిపై సినిమా రూపొందుతోందని తెలిసినప్పటి నుంచి, అంటే 2020 నుంచి ఆమె కుటుంబం అజ్ఞాతంలో ఉందని, తరచుగా ఇళ్లు మారుతోందని గంగూబాయి కుటుంబం తరఫు న్యాయవాది నరేంద్ర వెల్లడించారు. గంగూబాయి మనవరాలు భారతి కూడా మేకర్స్‌పై విరుచుకుపడింది. డబ్బు కోసం దురాశతో కుటుంబం పరువు తీశారని పేర్కొంది.
 
ఇకపోతే.. అలియా భట్ నటించిన “గంగూబాయి కతియావాడి” సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. 
 
ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని సంతోషంగా ఉన్న చిత్రబృందం ఆనందాన్ని ఆవిరి చేస్తూ గంగూబాయి తనయుడు సినిమాపై ఫైర్ అయ్యాడు. గంగూబాయి కుటుంబం, ఆమె దత్తపుత్రుడు బాబు రావుజీ షా, ఆమె మనవరాలు భారతి ఈ చిత్రం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.