శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2016 (14:07 IST)

దేశ ఏకీకరణకే 'గౌతమీపుత్ర శాతకర్ణి'... ఈ చిత్రం భావితరాలకు గొప్ప పుస్తకం : హీరో బాలకృష్ణ

దేశ ఏకీకరణ కోసమే 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని నిర్మించినట్టు హీరో బాలృష్ణ అన్నారు. పైగా ఈ చిత్రం భావితరాల వారికి గొప్ప పుస్తకంలా నిలుస్తుందన్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ వారసుడి

దేశ ఏకీకరణ కోసమే 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని నిర్మించినట్టు హీరో బాలృష్ణ అన్నారు. పైగా ఈ చిత్రం భావితరాల వారికి గొప్ప పుస్తకంలా నిలుస్తుందన్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ హీరోగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. తండ్రికి తగ్గ తనయుడిగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. 
 
గత కొంతకాలంగా ఫ్యాక్షన్ తరహా చిత్రాలతో పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్స్‌తో మాస్ ప్రేక్షకుల బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం కంచె డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 'గౌతమీపుత్ర శాతకర్ణీ' చిత్రంలో నటించారు. ఈ చిత్రం బాలయ్యకు 100వ చిత్రం కావడం ఒకటైతే.. భారతదేశాన్ని ఒక్కతాటిపై తీసుకు వచ్చిన తెలుగు తేజం గొప్ప చక్రవర్తి 'గౌతమీపుత్ర శాతకర్ణి' చరిత్రం ఆధారంగా తీస్తున్న చిత్రం కావడం మరో విశేషం.
 
'గౌతమీపుత్ర శాతకర్ణి' షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ బ్రహ్మాండమైన స్పందనను దక్కించుకోగా శనివారం పూర్తిస్థాయి థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు. బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్‌లు శుక్రవారం కరీంనగర్‌లోని కోటి లింగాలు ఆలయంలో ఉదయం 11 గంటలకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం కరీంనగర్‌లోని తిరుమల 70 ఎమ్ఎమ్ థియేటర్లో 5 గంటల నుంచి ట్రైలర్ విడుదల కార్యక్రమం మొదలవుతుంది. ఈ వేడుకకు బాలయ్య, క్రిష్‌లు హాజరవుతారు.
 
అనుకున్న ముహూర్తం ప్రకారం 5: 30లకు 2 నిముషాల 11 సెకన్ల ట్రైలర్ విడుదలవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 100 థియేటర్లలో 100 మంది ప్రత్యేక అతిథుల నడుమ ఈ లాంచ్ జరగనుంది. ఇక ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రంలో బాలయ్యకు తల్లిగా బాలీవుడ్ హీరోయన్ హేమమాలిని నటించగా ఆయన భార్యగా అందాల భామ శ్రియ నటిస్తుంది. 
 
ఈ ట్రైలర్ విడుదలపై బాలకృష్ణ స్పందిస్తూ.... అఖండభారతావనిని పరిపాలించిన గొప్ప రాజు గౌతమీపుత్ర శాతకర్ణి అని చెప్పారు. గౌతమీపుత్రశాతకర్ణి సినిమా పంచభక్ష్యపరమాన్నాలంత గొప్పగా వచ్చిందన్నారు. భావితరాలకు ఈ సినిమా గొప్ప పుస్తకంలా నిలుస్తుందని తెలిపారు. శాతవాహనులను ఇప్పటికీ ప్రపంచంలోని వివిధ దేశాలు తలచుకుంటాయని, తెలుగు వారి కీర్తిప్రతిష్టలను దిగంతాలకు వ్యాపింప చేసిన మహారాజు గౌతమీపుత్ర శాతకర్ణి అని ఆయన కొనియాడారు.
 
ఆయనలాగే తన తండ్రి కూడా తన వెన్నుపై తెలుగు దేశం జెండాను మోశారని ఆయన చెప్పారు. శాతవాహన సామ్రాజ్యానికి కోటిలింగాలు ముఖద్వారం వంటిదన్నారు. అందుకే ఇక్కడ ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నామని ఆయన తెలిపారు. తన 150వ సినిమాగా ఈ సినిమాను చేయడం తన అదృష్టమన్నారు. తెలుగు సినీ చరిత్రలో ఈ సినిమా మరుపురాని సినిమాగా నిలిచిపోతుందని ఆయన తెలిపారు. దేశ ఏకీకరణకే గౌతమీపుత్ర శాతకర్ణి పోరాటం చేశారని ఆయన చెప్పారు. శాంతి, సుస్థిరతతో ఆయన పరిపాలించారని బాలయ్య తెలిపారు.