గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో సినిమా ఆరంభం
Gopichand and Srinu Vaitla
హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా గోపీచంద్ కు 32వ సినిమా ప్రకటన వచ్చింది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి తొలి ప్రొడక్షన్ వెంచర్ ఇది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై అత్యున్నత స్థాయి ప్రొడక్షన్ , సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా కోసం చిత్రాలయం స్టూడియోస్‌తో కలిసి పని చేస్తుంది. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా చేరారు.
ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ నేడు ప్రారంభం ఆయింది. ఈ షెడ్యూల్లో, ప్రధాన తారాగణంతో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది.
నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ - ''పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద బ్యానర్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. విశ్వప్రసాద్ గారికి ధన్యవాదాలు. సినిమా చాలా అద్భుతంగా వస్తోంది. 27 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఈ సినిమాకి ఒక యూనిక్ పాయింట్ వుంది. ఈ సినిమాతో శ్రీను వైట్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. గోపీచంద్, శ్రీనువైట్ల కాంబోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది'' అన్నారు
ఈ సినిమాలో గోపీచంద్‌ని కొత్త అవతార్ లో శ్రీను వైట్ల ప్రెజెంట్ చేస్తున్నారు. శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. కెవి గుహన్ డీవోపీగా చేస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.