శనివారం, 2 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 9 మార్చి 2024 (16:16 IST)

చివరి అరగంట థియేటర్స్ లో క్లాప్స్, విజల్స్ పడుతూనే వున్నాయి : గోపీచంద్

Radha mohan, gopichand, harsha
Radha mohan, gopichand, harsha
హీరో గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించిన బీమా మహా శివరాత్రి సందర్భంగా  మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై ఆధారణపొందుతోందని చిత్ర యూనిట్ తెలియజేస్తుంది. 
 
హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. భీమా చిత్రాన్ని గొప్పగా ఆదరించి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇంత మంచి కథని నా దగ్గరకి తీసుకొచ్చి, సినిమాని అద్భుతంగా తీసి, ప్రేక్షకుల చేత ప్రశంశలు అందుకునేలా చేసిన దర్శకుడు హర్షకి ధన్యవాదాలు.  సినిమాకి కావాల్సినదంత సమకూర్చి ఎక్కడా రాజీపడకుండా సినిమా నిర్మించి ఇంత మంచి అవుట్ పుట్ తెచ్చిన నిర్మాతలు రాధమోహన్, శ్రీధర్ గారికి ధన్యవాదాలు. నరేష్ గారితో సినిమా చేసి చాలా కాలమైయింది. ఇందులో సెకండ్ హాఫ్ లో ఆయన పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. స్వామీ వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. థియేటర్స్ లో అదిరిపోయాయి. అజ్జు చాలా మంచి డైలాగ్స్ రాశారు. డైలాగ్స్ కి థియేటర్స్ లో క్లాప్స్ పడుతున్నాయి. ఫైట్స్ ఎక్స్ ట్రార్డినరీగా వున్నాయి. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో ఎమోషన్ ని అద్భుతంగా ఎలివేట్ చేస్తూ ఫైట్స్ డిజైన్ చేశారు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. చివరి అరగంట థియేటర్స్ లో క్లాప్స్, విజల్స్ పడుతూనే వున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ అద్భుతంగా చేశారు. రవి బస్రూర్ ఎక్స్ ట్రార్డినరీగా మ్యూజిక్ చేశారు. తన మ్యూజిక్ ఈ సినిమాకి ఒక బ్యాక్ బోన్. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇంకా సినిమా చూడనివారు తప్పకుండా థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి. గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు' అన్నారు.
 
నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ..ఇంత మంచి ప్రాజెక్ట్ ని నా వద్దకు తీసుకొచ్చిన మా సహా నిర్మాత శ్రీధర్ గారికి ధన్యవాదాలు. ఇంతమంచి ప్రాజెక్ట్ ని చేసే అవకాశం ఇచ్చిన గోపీగారికి, హర్ష గారికి ధన్యవాదాలు. అజ్జు మంచి డైలాగ్స్ రాశాడు. ఆర్ట్ డైరెక్టర్ రమణ లంక సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. డీవోపీ స్వామీ అద్భతమైన విజువల్స్ ఇచ్చారు. ప్రేక్షకులు విజువల్స్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నరేష్ గారి పాత్ర అందరినీ అలరిస్తుంది.  రవి బస్రూర్ మ్యూజిక్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచింది. గూస్ బంప్స్ మ్యూజిక్ ఇచ్చారు.  రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, వెంకట్ అద్భుతంగా యాక్షన్ డిజైన్ చేశారు. ఎడిటర్ తమ్మిరాజు గారు చాలా అద్భుతంగా ఎడిట్ చేశారు. మా ప్రొడక్షన్ టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. గోపీచంద్ గారితో పంతం సినిమా తర్వాత మా అనుబంధం అలానే కొనసాగుతుంది. ఈ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించాం. సినిమా విజువల్స్ రిచ్ నెస్ తెరపై కనిపిస్తుంది. సినిమాకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పంధన వస్తోంది'' అన్నారు.
 
దర్శకుడు హర్ష మాట్లాడుతూ.. భీమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పంధన చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ లో ప్రేక్షకుల కేరింతలు చూడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది మా అందరి టీం వర్క్. నిర్మాతలు శ్రీధర్, రాధమోహన్ గారికి ధన్యవాదాలు. ఎంతో గొప్ప ప్రోత్సహించి అద్భుతంగా పెర్ఫార్ చేసిన గోపీచంద్ గారికి ధన్యవాదాలు. భీమా, రామాల ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. నన్ను నమ్మిన నరేష్ గారికి ధన్యవాదాలు. తన పాత్రని చాలా మెరుగుపరిచారు. ఆడియన్స్ ఆ ట్రాక్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అజ్జు చాలా మంచి డైలాగ్స్ రాశారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ గొప్పగా యాక్షన్ డిజైన్ చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. థియేటర్స్ లో ఎంజాయ్ చేసే సినిమా ఇది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలి'' అని కోరారు.
 
డా. నరేష్ వికే మాట్లాడుతూ.. చాలా మంది ప్రేక్షకులు భీమా చూసి ఇంటర్వెల్ ఎక్స్ లెంట్, క్లైమాక్స్ బ్లాక్ బస్టర్ అని మెసేజ్ పెట్టారు. ప్రతి సినిమాకి ఈ రెండు చాలా కీలకం. ఇందులో విజయం సాధించిన దర్శకుడు హర్షకి అభినందనలు.  సంక్రాంతి సినిమాల శివరాత్రి సినిమా వుంటుంది. భీమా శివరాత్రి సినిమా. థియేటర్స్ దద్దరిల్లాయి. రెండు పాత్రలు పండించడం చాలా కష్టం. గోపీచంద్ గారు చాలా అద్భుతంగా పండించారు. గోపీచంద్ కి హ్యాట్సప్. రాధమోహన్ గారు చాలా రిచ్ గా తీశారు. ప్రతిఒక్కరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేసే మాస్ సినిమా ఇది. సినిమాలో పని చేసిన పేరుపేరునా అందరికీ ధన్యవాదాలు'' తెలిపారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ ప్రెస్ మీట్ చాలా గ్రాండ్ గా జరిగింది.