బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2023 (15:10 IST)

హెబ్బా పటేల్ సందేహం నుంచి ఆకట్టుకుంటోన్న ఫస్ట్ నైట్ సాంగ్

Hebba Patel, Suman Wootukuri
Hebba Patel, Suman Wootukuri
విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ మీద సత్యనారాయణ పర్చా నిర్మాతగా హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో  నిర్మించిన సినిమా ‘సందేహం’. ‘షి బిలీవ్డ్’ అనేది ట్యాగ్ లైన్.  లవ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా రాబోతోన్న ఈ మూవీకి ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. 
 
ఈ చిత్రం మేకర్లు థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. 'మనసే మరలా' అంటూ సాగే ఈ పాట ఎంతో ఆహ్లాదకరంగా, వినసొంపుగా ఉంది. ఎస్పీ చరణ్, కే ప్రణతిల గానం, పూర్ణాచారి సాహిత్యం, సుభాష్ ఆనంద్ బాణీ చక్కగా కుదిరాయి. ఇక ఈ లిరికల్ వీడియోలో హెబ్బా పటేల్, సుమన్ వూటుకూరిల పాత్రల తీరు ఆకట్టుకుంటుంది. భార్యభర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉండాలో చూపించారు.
 
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. టైటిల్, ఫస్ట్ లుక్, సాంగ్స్ ఇలా అన్నీ కూడా సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.  ఈ చిత్రంలో శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సురేష్ దుర్గం ఎడిటర్ గా పని చేస్తున్నారు.