శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 15 జనవరి 2023 (16:30 IST)

దేవ బ్రాహ్మణులపై కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన బాలయ్య

Balakrishna
వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్‌లో నందమూరి హీరో బాలకృష్ణ  దేవ బ్రాహ్మణులకు వర్తించేలా కామెంట్లు చేశారు. దేవ బ్రాహ్మణుల గురువు దేవల మహర్షి అని వారి నాయకుడు రావణుడు అంటూ బాలయ్య వ్యాఖ్యానించారు. దీంతో ఆ వర్గానికి చెందిన ప్రజలు బాలకృష్ణపై ఫైర్ అయ్యారు. 
 
ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన దేవ బ్రాహ్మణులు.. బాలయ్యకు చరిత్ర తెలియకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన చెందారు. ఈ వివాదం బాలకృష్ణ దృష్టికి చేరడంతో ఆయన స్పందించారు. 
 
దీనిపై బాలకృష్ణ వివరణ ఇస్తూ.. ఎవరిని కించపరిచేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇతరుల మనోభావాలను నొప్పించే తత్వం తనది కాదని క్షమాపణలు చెప్పారు. ఈ వ్యాఖ్యలు పొరపాటున వచ్చాయని సంజాయిషీ ఇచ్చారు. తనకు తెలియని సమాచారాన్ని తెలపినందుకు బ్రాహ్మణ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపినట్లు బాలకృష్ణ తెలిపారు.