శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (19:58 IST)

కార్తికేయ ఖాతాలో కొత్త రికార్డ్.. 72గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్

యంగ్ హీరో కార్తికేయ ఖాతాలో కొత్త రికార్డ్ నమోదైంది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా'. పెగళ్ళపాటి కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మించాడు. భారీ అంచనాలతో మార్చి 19న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. 
 
కార్తికేయ కెరీర్ లో మరో భారీ ప్లాప్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం ఓటిటిలో విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. ఏప్రిల్ 23న ప్రముఖ ఓటిటి సంస్థ 'ఆహా'లో విడుదలైంది 'చావు కబురు చల్లగా'. అయితే సినిమా విడుదలకు ముందు ఓటిటి ప్రేక్షకుల కోసం కొంచం రీఎడిట్ చేశారట మేకర్స్. 
 
ఇక ఆహాలో ఈ చిత్రం విడుదలైన 72గంటల్లోనే 100 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌తో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓటిటిలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో కార్తికేయ స్వర్గపురి బండి డ్రైవర్‌గా విలక్షణ పాత్ర పోషించారు. మురళీ శర్మ, రావు రమేష్, ఆమని ముఖ్యపాత్రల్లో నటించారు.