మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2024 (10:14 IST)

మోక్షజ్ఞ కోసం శోభన.. అమ్మగా కనిపించనున్నారట!

shobana
దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తొలి సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ వార్త జోరుగా షికారు చేస్తుంది. మోక్షజ్ఞ నటిస్తున్న ఈ సినిమాలో హీరో తల్లి పాత్ర చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుందట. 
 
ఈ పాత్రలో నటించేందుకు చాలా మంది పేర్లు పరిశీలించారట మేకర్స్. అయితే, అలనాటి హీరోయిన్ శోభన అయితే, ఈ పాత్రకు పర్ఫెక్ట్‌గా సూట్‌ అవుతుందని ఆమెను సంప్రదించారట. 
 
చాలా గ్యాప్ తరువాత శోభన టాలీవుడ్‌లో "కల్కి 2898 ఎడి" సినిమాలో  యాక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాలో తల్లి పాత్రకు ఆమెను సంప్రదించడంతో ఆమె వెంటనే ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.