గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 7 డిశెంబరు 2022 (20:01 IST)

డేంజరస్ లో హీరోయిన్లు గట్స్ తో చేశారు, రాజకీయ కథతో 2 పార్ట్ : రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma
Ram Gopal Varma
ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో "డేంజరస్" (మా ఇష్టం) సినిమాను ప్రయోగాత్మకంగా తెరకెక్కించడం జరిగిందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రలలో కంపెనీ పతాకంపై ఆయన రూపొందించిన ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని తన కార్యాలయంలో పాత్రికేయులతో వర్మ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు.  "అబ్బాయిలు, అమ్మాయిలు ప్రేమించుకోవడం అనేది కామన్. ఆ తరహా కథలతో ఇప్పటివరకు వేలాది సినిమాలు వచ్చాయి. అయితే దానికి భిన్నంగా ఇద్దరు అమ్మాయిలు ఎలాంటి పరిస్థితులలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయన్న ఆసక్తికరంగా, రసవత్తరంగా సాగే రొమాంటిక్ యాక్షన్ అంశాలు ప్రధానంగా ఈ సినిమాను తీశాం. రెగ్యులర్ కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి" అని అన్నారు. 
 
"యూరోపియన్, అమెరికన్ వంటి దేశాలలో లెస్బియిజమ్  అన్నది ఉంది. కానీ మన దేశంలో 2018లో సుప్రీం కోర్టు కూడా అనుమతి ఇవ్వడంతో ఈ అంశంతో సినిమా రూపొందించాలన్న ఆలోచనకు కార్యరూపమే ఇది. లెస్బియిజమ్ సపోర్ట్ చేస్తూ తీసిన చిత్రం కాధు కాదు. ఇద్దరు అమ్మాయిలు ఎలాంటి పరిస్థితులలో  ప్రేమలో పడ్డారు అన్న అంశాన్ని చూపించాం. ఇద్దరు అమ్మాయిలు ముద్దు పెట్టుకుంటే చూడాలని చాలా మంది మగవాళ్లలో ఉంటుందని ఓ సర్వేలో చదివాను. హీరో డేట్స్ లేకపోయినా ఇద్దరు హీరోయిన్లతో కూడా సినిమాలు చేయవచ్చు అన్న ఆలోచన కూడా ఈ సినిమాతో మొదలవుతుంది" .అని మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన బదులిచ్చారు.. ఇంకా మాట్లాడుతూ. ఈ సినిమాలోని తమ పాత్రలను ఇద్దరు హీరోయిన్లు ఎంతో ధైర్యంగా చేశారు. వాస్తవానికి ఇలాంటి పాత్రలు అందరూ చేయలేరు. వారిద్దరు తమ పాత్రలలో గ్లామర్ తో పాటు మంచి నటనను కనబరిచారు. మరో విశేషం ఏమిటంటే.... ఇద్దరు అమ్మాయిలతో ఒక డ్యూయెట్ సాంగ్ ను ఈ సినిమాలో పెట్టాం. ప్రపంచంలోనే ఇలా డ్యూయెట్ సాంగ్ చేయడం మొదటిసారి. తెలుగు, హిందీ, తమిళ బాషలలో విడుదలవుతున్న ఈ సినిమాను తెలుగులో నట్టి కుమార్ విడుదల చేస్తున్నారు" అని చెప్పారు. 
 
రాజకీయ కథతో  2 పార్ట్  సినిమాలు "వ్యూహం", "శపథం" 
ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలు రసవత్తర డ్రామాతో సాగుతున్నాయి. దీనిని ఆధారంగా చేసుకుని వైఎస్. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుంచి చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సాగుతున్న పరిస్థితులను ఎలా తమకు అనుకూలంగా మలచుకున్నారన్న అంశాలతో "వ్యూహం" సినిమాను తీయబోతున్నాం. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. దీనికి పార్ట్-2గా "శపథం" సినిమా చేస్తాను. ఈ సినిమాలకు సంబందించిన ఆర్టిస్టులు తదితర వివరాలను మళ్ళీ తెలియజేస్తాను. ఇంకా ఉపేంద్రతో ఓ సినిమా, బిగ్ బి అమితాబచ్చన్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాను. అమితాబ్ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ఉంటుంది అంటూ వర్మ తన ఇంటర్వ్యూ ను ముగించారు.