శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 జులై 2022 (11:38 IST)

శ్రావణ భార్గవి - హేమచంద్రల విడాకులు నిజమేనా?

Hemachandra-Bhargavi
తెలుగు చిత్రపరిశ్రమలో ప్రముఖ సింగర్లుగా ఉన్న శ్రావణి భార్గవి, హేమచంద్రలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే, వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్టు ముమ్మరంగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై వారు స్పందించలేదు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా శ్రావణి భార్గవి "ఒకపరి కొకపరి" అంటూ సాగే అన్నమయ్య కీర్తనను ఆలపించిన వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో భార్గవి కనిపించిన తీరు వివాదాస్పదమైంది. ఆ వీడియోను తొలగించాలని తిరుమల అన్నమయ్య ట్రస్ట్ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే, తన వీడియోలో అశ్లీలం ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. 
 
చివరకు శ్రావణభార్గవి వెనక్కి తగ్గారు. తన వీడియోలో బ్యాక్ గ్రౌండ్‌లో వస్తున్న అన్నమయ్య కీర్తనను తొలగించింది. కానీ, వీడియోను మాత్రం తొలగించలేదు. కేవలం సంగీతం వినిపిస్తుండగా ఆ వీడియోను కొనసాగించింది. అదేసమయంలో ఈ వీడియోలో శ్రావణభార్గవి మెడలో తాళి, కాళ్ళకు మెట్టెలు, నుదట బొట్టు పెట్టుకోకుండా కనిపించారు. దీంతో హేమచంద్రతో తన విడాకులపై జరుగుతున్న ప్రచారానికి ఆమె మరింత బలం చేకూర్చినట్టయింది.