గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఎం
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2020 (09:19 IST)

మాస్క్ వాడిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత?! ఎప్పుడు, ఎక్కడ?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బ్రతికుండగా కరోనా లేదుకదా!... మరి ఆమె మాస్క్ వాడటమేంటి అనుకుంటున్నారా?.. అయితే ఈ వార్త చదవాల్సిందే!
 
ఈ గెటప్ కేవలం షాట్ గ్యాప్ లోనే.. సీన్ లో ప్రవేశించాక మాస్క్ ఉండదు. నాటి వాతావరణంలో అసెంబ్లీ సెషన్స్ జరిగేప్పుడు లైవ్ లో రాజకీయ నాయకులు ఎలా కనిపిస్తారో అలానే తీస్తారు.
 
ఇప్పుడంటే కోవిడ్ 19 విలయం వల్ల జాగ్రత్త తీసుకోవాల్సి వస్తోంది కాబట్టి ఆన్ లొకేషన్ ఈ పాట్లు తప్పడం లేదు. ‘తలైవి’ కొత్త షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. కంగన రనౌత్ హుషారుగా షూటింగులో పాల్గొన్నారు. కోవిడ్ నియమనిబంధనల ప్రకారం మాస్క్ ధరించి శానిటైజ్ చేసుకుని మరీ సీన్లలో నటించారు.
 
తలైవి ఖద్దరు ధరించినప్పటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్ని కంగన స్వయంగా సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. వీటిలో ఆమె తమిళనాడు మాజీ సిఎం జయలలితలానే కనిపిస్తోంది.
 
విప్లవ నాయకురాలి సినిమా తలైవి మరో షెడ్యూల్ పూర్తయిందని కంగన స్వయంగా వెల్లడించింది. కరోనా తర్వాత చాలా విషయాలు మారతాయి! అని ట్వీట్ చేసింది. దర్శకనిర్మాతలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు కంగన.

ఈ ఫోటోలు పరిశీలిస్తే  కంగనా చీరతో ఫోజు..అలానే అసెంబ్లీ సమావేశంలో మాస్క్ తో కూర్చోవడం కనిపిస్తున్నాయి. కొన్ని ఫోటోల్లో క్వీన్ చిరునవ్వులు చిందిస్తూ మాస్క్ లేకుండానే కనిపించింది.
 
ఇక నాడు జయలలిత యంగ్ ఏజ్ లో ఎలా ఉండేదో ఆల్మోస్ట్ అదే రూపాన్ని కంగన  లైవ్ లో చూపించే ప్రయత్నం చేయడం ఆసక్తికరం.