శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 మార్చి 2024 (14:20 IST)

ఆర్ఆర్ఆర్ సూపర్ సక్సెస్.. యాడ్స్‌పై దృష్టి పెట్టిన జూనియర్ ఎన్టీఆర్

junior NTR
గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద "RRR" సూపర్ సక్సెస్‌ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవరలో నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్‌లో వార్2, యష్ రాజ్ ఫిల్మ్స్ మరొక స్పై థ్రిల్లర్‌లో ఒక పాత్రను పోషించాడు. ప్రస్తుతం యాడ్స్‌పై ఎన్టీఆర్ దృష్టి పెట్టాలనుకుంటున్నాడు. తన కెరీర్‌లో చాలా ఎండార్స్‌మెంట్‌లు చేసినప్పటికీ, మరికొన్ని ప్రకటనలు చేయాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది
 
ఇందులో భాగంగా ముంబై నుండి రెండు అగ్రశ్రేణి బ్రాండ్-ఎండార్స్‌మెంట్ ఏజెన్సీలు ఆయన్ని కలిసినట్లు తెలుస్తోంది. అతి త్వరలో దేశంలోని కొన్ని పెద్ద బ్రాండ్‌ల కోసం తారక్‌ను ఎంచుకునే అవకాశం వుంది. 
 
టాలీవుడ్ విషయానికి వస్తే, సూపర్ స్టార్ మహేష్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ విషయంలో తన తోటివారి కంటే చాలా ముందున్నాడు. రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి ఇతర స్టార్లు బాగానే ఉన్నారు. కానీ ఆ దూకుడు స్థాయికి రాలేదు. మరి ఈ గేమ్‌ని జూనియర్ ఎన్టీఆర్ ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి