సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2024 (15:34 IST)

అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన కాజల్ అగర్వాల్ సత్యభామ

Kajal Aggarwal
Kajal Aggarwal
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటించిన “సత్యభామ” సినిమా డిజిటల్ ప్రీమియర్ కు వచ్చేసింది. నేటి నుంచి ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 7వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కు వచ్చింది సత్యభామ. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్యభామగా కాజల్ అగర్వాల్ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
 
ఓ హత్యకేసులో ఎమోషనల్ అయిన సత్యభామ ఆ కేసును ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఎలా సాల్వ్ చేసింది, బాధితురాలికి ఎలా న్యాయం చేసింది అనేది ఈ సినిమాలో హార్ట్ టచింగ్ గా, ఇంటెలిజెంట్ గా చూపించారు. సత్యభామలో కాజల్ అగర్వాల్ యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ అయ్యాయి. సత్యభామ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. థియేటర్ కంటే ప్రైమ్ వీడియోలోనూ మరింత మంచి రెస్పాన్స్ వస్తుందని మూవీ టీమ్ ఆశిస్తున్నారు.