న్యూయార్క్ లో ప్రదర్శించనున్న `కంబాలపపల్లి కథలు`
ఆహా! వేదికగా నటుడు, రచయిత ప్రియదర్శి చేసిన `కంబాలపల్లి కథలు`. ఛాప్టర్1గా జనవరిలో విడుదలైంది. ఈ సినిమా ఇప్పుడు న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్‌కు జూన్ 4న ప్రదర్శితమవుతోంది. ప్రియదర్శి, హర్ష నటించిన ఈ సినిమాను అశ్వనీదత్ కుమార్తె ప్రియాదత్ నిర్మాత. ఉదయ్ గుర్రా దర్శకుడు.
ఈ కథ తెలంగాణలోని ఓ గ్రామంలో తీశారు. తనకు తెలిసిన విషయాలను బేస్ చేసుకుని ప్రియదర్శి రాసిన కథ ఇది. తెలంగాణలోని మారుమూల ప్రాంతంలో కంప్యూటర్ అంటే ఏమిటో తెలీని యువతకు కంప్యూటర్ తెచ్చి నేర్పించాలని తాపత్రపడే పాత్రను ప్రియదర్శి పోషించాడు. అక్కడి యాస అక్కడి గ్రామీణ యువకులు, అక్కడి ప్రజలు నటించిన ఈ సినిమా అంతా నాచురల్ గా వుంటుంది. జూన్ 4న జరగబోయే న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్‌లో ఇది ప్రదర్శించనున్నారు. తెలుగులో `కేరాప్ కంచర పాలెం` తర్వాత ఈ సినిమాకే ఆ అవకాశం దక్కింది.