గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 అక్టోబరు 2020 (11:24 IST)

జైలుకు వెళ్లడం కోసం ఎదురుచూస్తున్నా..కంగనా రనౌత్

ముంబై కోర్టు ఆదేశాలతో బాలీవుడ్‌ నటి కంగనా, ఆమె సోదరి రంగోలీ చందేలాపై కేసు నమోదయింది. మరో కేసులో బాంద్రా మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేటు ఆదేశాల మేరకు వీరు వచ్చే వారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తన స్టైల్‌లో రియాక్ట్ అయింది కంగనా రనౌత్. ఆదర్శప్రాయులైన మహనీయుల మాదిరిగానే తాను కూడా జైలుకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నానంటూ ప్రకటించింది. 
 
వీర సావర్కర్‌, నేతాజీ వంటి వారు తనకు ఆదర్శమని వారిలా తాను కూడా జైలు జీవితాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. అమిర్‌ ఖాన్‌ మౌనం వహించటం పట్ల కంగనా పరోక్షంగా అసహనం వ్యక్తం చేసింది.
 
రాణి లక్ష్మీభాయి కోటను కూల్చినట్లే తన ఇంటిని ధ్వంసం చేశారని వీర సావర్కర్‌ను కారాగారంలో ఉంచగా తనను జైలుకు పంపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని కంగనా ఆరోపించింది. దేశంలో అసహనం పెరుగుతోందని ఆరోపిస్తున్న సభ్యులను ఇక్కడ ఎన్ని బాధలకు గురయ్యారో ఎవరైనా ప్రశ్నిస్తే బాగుంటుంది అంటూ ఆ పోస్టును ఆమిర్‌ ఖాన్‌కు ట్యాగ్‌ చేసింది.