సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2020 (19:41 IST)

పీసీ శ్రీరామ్ ట్వీట్‌పై కంగనా రనౌత్ ట్వీట్.. అది నాకు జరిగిన నష్టం...

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. పలువురు ప్రముఖులపైన కూడా ఆమె విమర్శలు గుప్పించారు. ఇదే కాకుండా ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దీంతో శివసేన పార్టీ నాయకులు ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడారు. కంగన కూడా వారికి ఘాటుగా సమాధానాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇకపై కంగనపై ఎటువంటి కామెంట్లు చేయొద్దని శివసేన అధికారప్రతినిధి సంజయ్‌ రౌత్‌ బుధవారం నాయకులకు సూచించారు.
 
మరోవైపు తన సినిమాను తిరస్కరించేంత అసౌకర్యం పీసీ శ్రీరామ్‌కు ఎందుకు కలిగిందో అర్థం కావడం లేదుని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ అన్నారు. మంగళవారం పీసీ శ్రీరామ్‌ నటిపై ఓ ట్వీట్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచిన చేసిన సంగతి తెలిసిందే.
 
'కంగన ప్రధాన పాత్రలో నటించబోతున్నారనే కారణంగా నేను ఓ ప్రాజెక్టును తిరస్కరించా. ఆమెతో పనిచేయడాన్ని అసౌకర్యంగా ఫీలయ్యా. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాతలకు వివరించా, అర్థం చేసుకున్నారు. కొన్నిసార్లు మనకు ఏది సరైంది అనిపిస్తే అదే చేయాలి. ఆ చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌' అని పేర్కొన్నారు. ఆయన మాటలు సోషల్‌మీడియాలో చర్చకు దారి తీశాయి. కొందరు ఆ నిర్ణయాన్ని మెచ్చుకోగా.. మరికొందరు తప్పుపట్టారు.
 
అయితే దీనిపై కంగన స్పందించారు. పీసీ శ్రీరామ్‌ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. 'మీ లాంటి లెజెండ్‌తో కలిసి పనిచేసే అవకాశాన్ని కోల్పోయాను సర్‌. అది నాకు జరిగిన నష్టం. కానీ, నాతో అసౌకర్యంగా ఫీల్‌ అవడానికి సరైన కారణం ఏమిటో తెలియడం లేదు. కానీ, మీరు సరైన నిర్ణయం తీసుకున్నందుకు సంతోషిస్తున్నా. ఆల్‌ ది బెస్ట్‌' అని కామెంట్‌ చేశారు.