మంగళవారం, 1 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 29 మార్చి 2025 (16:09 IST)

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

K Raghavendra Rao, Satish Vegesna,  Anil Ravipudi, Satish Vegesna, BVS Ravi
K Raghavendra Rao, Satish Vegesna, Anil Ravipudi, Satish Vegesna, BVS Ravi
'కొత్తవారిని తయారు చేయడంలో ఆనందం వేరు. మంచి కథలకు, కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి కథాసుధ గొప్ప వేదిక'అన్నారు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు. కే రాఘవేంద్రరావు, దర్శకుడు సతీష్ వేగేశ్న సూపర్ విజన్ లో ఈటీవీ విన్ లో ప్రసారం కానుంది కథాసుధ. ప్రతి అదివారం ఓ అద్భుతమైన కథతో అలరించబోతోంది. 'కథాసుధ' కి సంబధించిన టైటిల్, ప్రోమో లాంచ్ ఈవెంట్ ఈ రోజు గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరక్టర్ అనిల్ రావిపూడి, డైరెక్టర్ సతీష్ వేగ్నేశ, బివిఎస్ రవి, తనికెళ్ళభరణి తో పాటు కథాసుధ టీం అంతా పాల్గొన్నారు.
 
కే రాఘవేంద్రరావు మాట్లాడుతూ, బిగినింగ్ డేస్ లో దర్శకుడు కావాలని అవకాశాల కోసం చాలా ఇబ్బంది పడతాం. ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. పాత నీరు వెళ్లి కొత్త నీరు రావడం సహజం. మనం ఫ్యూచర్ లో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ..అప్పుడే ఈటీవీ కూడా స్టార్ట్ అయింది. ఈటీవీ ద్వారా రామోజీరావు గారు, బాపినీడు గారు, అజయ్ శాంతి గారు అందరం కలిసి  శాంతినివాసం సీరియల్ స్టార్ట్ చేశాం. కొత్త దర్శకుల్ని రచయితల్ని నటీనటుల్ని పరిచయం చేయొచ్చు అనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం ఇది. శాంతి నివాసం ద్వారా రాజమౌళిని పరిచయచేసి  తర్వాత దర్శకుడిగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాని  చేయడం జరిగింది. దానికి బహుమతిగా రాజమౌళి బాహుబలి సినిమాని ఇచ్చారు. శాంతి నివాసం నుంచి ఇప్పుడు కలిసుందాం రా వరకు ఈటీవీ కి నాకు ఆ అనుబంధం కొనసాగుతూనే ఉంది. యూట్యూబ్లో చాలా అద్భుతమైనటువంటి ప్రతిభావంతులు ఉన్నారు.  మంచి డైలాగ్స్ కథలు రాసిన వారిని సెలెక్ట్ చేసాం. కొత్తవారిని తయారు చేయడంలో ఆనందం వేరు. ఇందులో నాలుగు ముఫ్ఫై నిమిషాల నిడివి గల సినిమాలు 17 రోజుల్లో తీశాం. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి కథా సుధా గొప్ప వేదిక. కొత్త దర్శకులు రచయితలు నటీనటులు దీంతో పరిచయం కావడం చాలా ఆనందంగా వుంది'అన్నారు
 
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ప్రారంభమైన యాడాదిలోనే ఈటీవీ విన్ తనకంటూ ఒక డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కుటుంబం అంతా కలిసి చూడదగ్గ  హెల్ది కంటెంట్ తో ఆకట్టుకుంటుంది. కథాసుధ చాలా గొప్ప ఆలోచన. మంచి కథలు, కొత్త ప్రతిభను తీసుకురావడానికి ఇది మంచి వేదిక. స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ కి వెళ్లాలని డ్రీమ్ అందరికీ ఉంటుంది. కానీ బిగ్ స్క్రీన్ లో అద్భుతమైనటువంటి మరపురాని చిత్రాలను తీసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు కొత్త ప్రతి పని ప్రోత్సహించడానికి ముందుకు రావడం నాకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. ఆయన్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఆయన తపనకి హ్యాట్సాఫ్. ఒక కథ  కామన్ మ్యాన్ కి అర్థమయ్యేలా ఉండాలి. 20 నిమిషాల్లో ఒక చక్కని కథని ఎంతమంది మంచి ఆర్టిస్టులు టెక్నీషియన్స్ తో చేసేలా ప్రోత్సహిస్తున్న రాఘవేంద్రరావు గారికి సతీష్ గారికి నా బెస్ట్ విషెష్. ఈ ప్రాజెక్టుకి పనిచేస్తున్న అందరి డ్రీమ్స్ ఫుల్ ఫిల్ కావాలని కోరుకుంటున్నాను'అన్నారు
 
దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ,  బాపినీడి గారికి, ఈటీవీ విన్ నితిన్, సాయికి థాంక్యూ. శతమానం భవతి డైరెక్టర్ అనగానే నాకు ఇచ్చే రెస్పెక్ట్  వేరే విధంగా ఉంటుంది. వారి కళ్ళల్లో తెలియని ఒక అభిమానం ఉంటుంది. ఎంత గొప్ప సినిమా అని చెప్తుంటారు. అలాంటి కథలు నా దగ్గర చాలా ఉన్నాయి. కానీ వాటిని సినిమాగా తీయాలంటే కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా లేదా అని అనుకుంటున్న సమయంలో ఈ టీవీ వారిని కలవడం జరిగింది. నేను చెప్పిన ఐదు కథలని సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారు. ఐదు కథలని 20 రోజుల్లో తీశాం. ఈ కథలన్నీ మీకు అలరిస్తాయి. ఇందులో మిమ్మల్ని తట్టి లేపే జ్ఞాపకాలు ఉంటాయి. మీరు మర్చిపోలేని అనుభూతులు ఉంటాయి. మా టీమ్ అందరికీ థాంక్యు. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ వారికి కృతజ్ఞతలు'అన్నారు.
 
డైరెక్టర్ బివిఎస్ రవి మాట్లాడుతూ.. కమర్షియల్ సినిమా పితామహుడు కే రాఘవేంద్రరావు గారు. ఆయన కథల్లో గొప్ప డ్రామా ఉంటుంది. నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి.  సినిమా ఎంత నిడివి ఉన్న కథ 20 నిమిషాలే ఉంటుంది. అలాంటి కథలని కథాసుధగా తీసుకురావడం ఈటీవీ వారి గొప్ప ప్రయోగం. ఈనాడు అంటేనే మంచి కథలు. ఉషాకిరణ్ మూవీస్ ద్వారా ఎన్నో మంచి కథలు ప్రేక్షకులకు చూపించారు. నితిన్ సాయి చాలా కమిట్మెంట్ ఉన్న పర్సన్స్. రాఘవేంద్రరావు గారు, సతీష్ గారి మార్గదర్శక మార్గదర్శకంలో ఈ కార్యక్రమం మొదలవడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను'అన్నారు.
 
తనికెళ్ల భరణి మాట్లాడుతూ, రామోజీరావు గారు మహనీయుడు. ఆయన ఆశయాలు ఎప్పుడూ కూడా చిరస్మరణీయంగా ఉంటాయి. మా రాఘవేంద్రరావు గారితో పరిచయం నా సౌభాగ్యం. ఈటీవీ చాలా గొప్ప వేదిక కథలకు పరమాద్భుతమైనటువంటి వేదిక. భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన కథలు, దర్శకులని ఈ వేదిక ఇవ్వబోతోంది. సతీష్ వేగ్నేష కథ చెప్పిన వెంటనే ఓకే అన్నాను. చాలా అద్భుతంగా చేశాడు. ఈటీవీ విన్ లో వచ్చే ఈ కథలు మన హృదయంలో దాచుకున్నదగ్గవి'అన్నారు.
 
బాలాదిత్య మాట్లాడుతూ, 34 ఏళ్ల క్రితం తొలిసారిగా కెమెరా ని ఫేస్ చేశాను .34 ఏళ్ల తర్వాత నా ఆరేళ్ల కూతురితో పాటు కలిసి నటించడం గ్రేట్ మెమొరీ. దీనికి ముఖ్య కారకులు డైరెక్టర్ సతీష్ గారు. ఈటీవీలో ఎన్నో కార్యక్రమాలు చేశాను. తెలుగు భాషని బ్రతికిస్తున్న సంస్థ ఈనాడు. ఆ సంస్థలో వచ్చిన సినిమాలన్నీ చాలా అద్భుతమైనవి. కథాసుధా కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది'అన్నారు.
 
యాక్టర్ సోనియా మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. మమ్మల్ని సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యు. రాఘవేంద్రరావు గారి సూపర్ విజన్ లో వర్క్ చేయడం నా అదృష్టం. నా కెరీర్ ని ఈటీవీ టెలివిజన్ నుంచే స్టార్ట్ చేశాను. ఈటీవీ కి ఎప్పుడు రుణపడి ఉంటాను.కథాసుధ మిమ్మల్ని అందరిని అలరిస్తుంది'అన్నారు.
 
ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ. కథాసుధ లో రాఘవేంద్రరావు గారు భాగమవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఆదివారం ఒక మంచి కథ మీ ఇంటికి వచ్చి పలకరిస్తుంది. బాపినీడు గారు ఈ ఆలోచన చెప్పిన తర్వాత రాఘవేంద్రరావు గారిని కలవడం జరిగింది. కొత్త టెక్నీషియన్స్ ని పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈటీవీ ఎల్లప్పుడూ కొత్త ప్రతి పని ప్రోత్సహిస్తుంది. తెలుగు సాహిత్యంలో చాలా అద్భుతమైనటువంటి కథలు ఉన్నాయి. ఆ కథలు సినిమాలో చెప్పలేకపోవచ్చు. కానీ ఈ కథాసుధ ద్వారా గొప్ప గొప్ప కథలు ప్రేక్షకులకి చేరువవుతాయని నమ్మకం ఉంది. కమర్షియల్ గురించి ఆలోచించకుండా తెలుగు సినిమాకి సాహిత్యానికి మా తరఫున ఒక కాంట్రిబ్యూషన్ భావిస్తున్నాం. తప్పకుండా చూడండి మమ్మల్ని ఆశీర్వదించండి'అన్నారు
 
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ.. ఈటీవీ విన్ మొదలుపెట్టి రెండేళ్లు అవుతుంది. పదిమంది దర్శకులుని మరో 15 మంది టెక్నీషియన్స్ ని ఎంతోమంది నటీనటుల్ని పరిచయం చేశాం. 90 ఏళ్ల సినిమా చరిత్రలో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న రాఘవేంద్రరావు గారు మా జర్నీలో తోడవడం మా అదృష్టంగా భావిస్తున్నా. అలాగే ఈ జర్నీలో మాకు తోడైన నేషనల్ అవార్డు విన్నర్ సతీష్ వేగ్నేష గారికి ధన్యవాదాలు. కథాసుధలలోని కథలని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు'అన్నారు.