గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 జనవరి 2022 (09:43 IST)

యూట్యూబ్ ఛానల్‌‌ను ప్రారంభించిన మహానటి

మహానటి కీర్తి సురేష్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా తన ఛానల్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపింది.
 
తన ఛానల్‌ను అందరూ సబ్ స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూడాలని కోరింది. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన షార్ట్ వీడియోస్, ఫిట్ నెస్ తదితర వీడియోలను కీర్తి పంచుకోనున్నట్టు సమాచారం. దక్షిణాదిన మంచి గుర్తింపు పొందిన హీరోయిన్లలో కీర్తి సురేశ్ ఒకరు. 
 
'మహానటి' సినిమాతో ఎంతో పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న కీర్తి... వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఆమె నటించిన తాజా చిత్రం 'గుడ్ లక్ సఖి' ఈ నెల 28న థియేటర్లలో విడుదల కానుంది. అలాగే మహేష్ బాబు కథానాయకుడిగా కీర్తి సురేష్ నటించిన సర్కారు వారి పాట ఏప్రిల్ 1, 2022న విడుదల కానుంది.