శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (14:26 IST)

కేజీఎఫ్ నుంచి తాజా అప్డేట్.. ఏంటంది?

కేజీఎఫ్ నుంచి తాజా అప్డేట్ వచ్చింది. యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ తొలి చాప్టర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ చిత్రం జూలై 16వ తేదీ రిలీజ్ కానుంది. 
 
ఈ నేపథ్యంలో తమిళ రైట్స్‌ను డ్రీమ్స్ వారియర్స్ సంస్థ కైవసం చేసుకుంది. దాదాపు 120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ చెప్పుకుంటోంది. ఇందులో యష్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నట్లు సినీ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలిపారు. కాగా.. ఇందులో రాకీ భాయ్‌ను ఢీ కొట్టేందుకు అధీరాగా వస్తున్నాడు బాలీవుడ్‌ హీరో సంజయ్‌దత్‌.
 
రవీనా టాండన్‌ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్‌ 2 విడుదల కానుంది.