శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 16 జులై 2024 (18:18 IST)

యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ తో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ మాక్స్ టీజర్

Max-sudeep
Max-sudeep
కన్నడ స్టార్ హీరో, అభినయ చక్రవర్తి బాద్‌షా కిచ్చా సుదీప్ నటించిన ‘మాక్స్’ టీజర్‌ను మంగళవారం (జూలై 16) నాడు విడుదల చేశారు. యాక్షన్ జానర్‌ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ మాక్స్ టీజర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
 
మాక్స్ పాన్-ఇండియన్ సినిమాగా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మాక్స్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కిచ్చా సుదీప్ చాలా కాలం తరువాత మళ్లీ మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. టీజర్‌లో అతని డెమి-గాడ్ లుక్ అభిమానులకు ఐ ఫీస్ట్‌లా ఉంది. మాస్, యాక్షన్ లవర్స్‌ను ఆకట్టుకునేలా సినిమాను తీయబోతోన్నారని టీజర్ చూస్తేనే తెలుస్తోంది.
 
విజయ్ కార్తికేయ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్, ప్రమోద్ శెట్టి తదతరులు నటించారు. అజనీష్ లోక్‌నాథ్ చిత్రానికి సంగీతం అందించారు. వి క్రియేషన్స్ బ్యానర్‌పై కలైపులి ఎస్ థాను, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్‌పై కిచ్చా సుదీప్ ఈ చిత్రాన్ని నిర్మించారు.