శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (12:45 IST)

నాగశౌర్య "కృష్ణ వ్రింద విహారి" చిత్రం టీజర్ రిలీజ్

యువ హీరో నాగశౌర్య, కొత్త అమ్మాయి షిర్లే సెటియా హీరోయిన్‌గా నటిస్తున్న "కృష్ణ వ్రింద విహారి" చిత్రం టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. నాగశౌర్య సొంత బ్యానరులో నిర్మితమైన ఈ చిత్రానికి అనీష్ కృష్ణ దర్శకత్వం వహించారు. లవ్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ టీజర్‌ను చూస్తే రొమాన్స్ పాళ్లు ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది. 
 
హీరోయిన్ ప్రేమ కోసం హీరోపడే ఆరాటం, ఆమె అలకలు, బుజ్జగింపులు, ఈ అమ్మాయిలేంట్రా అసలు అర్థంకారు అంటూ స్నేహితుల దగ్గర అసహనాన్ని ప్రదర్శించడం. పెళ్లి చేసుకుందాం సినిమాలో వెంకటేష్ కంటే బాగా చూసుకుంటాను వంటి కామెడీ టచ్‌లో ఈ టీజర్ ఉంది. ఏప్రిల్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.