ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 జులై 2022 (12:01 IST)

40000 థియేటర్‌లలో ఆర్జీవీ లడ్‌కీ.. హమ్మయ్య కల నెరవేరిందటగా!

Ladki
Ladki
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా రికార్డు సృష్టించింది. అవును షాకవకండి.. ఆర్జీవీ సినిమాలు ప్రస్తుత కాలంలో హిట్ కాని నేపథ్యంలో ఆయన లడ్‌కీ మాత్రం సూపర్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. తద్వారా ఆయన కల నెరవేరిందని చెప్పుకొచ్చాడు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో రూపొందిన లడ్‌కీ చిత్రాన్ని తెలుగులో 'అమ్మాయి'గా అనువదిస్తున్నారు.
 
అంతే కాదు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతోపాటు చైనాలోనూ విడుదల చేయనున్నారు. చైనీస్‌లో 'గర్ల్‌ 'డ్రాగన్‌' పేరుతో దాదాపు 40000 థియేటర్‌లలో విడుదల చేయడానికి వర్మ సన్నాహాలు చేస్తున్నారు. దుబాయ్‌కు చెందిన నిర్మాణ సంస్థ ఆర్ట్‌సీ మీడియా, చైనాకు చెందిన బిగ్‌ పీపుల్‌ సంస్థతో కలిసి రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. 
 
ఈ సినిమా ట్రైలర్‌ను ప్రపంచంలోనే అత్యంత పొడవైన బూర్జ్‌ ఖలీఫాపై ప్రదర్శించారు. ఇప్పటి వరకూ ఇండియన్‌ స్ర్కీన్‌ మీద భారీ విజయం సాధించిన చిత్రాలు దంగల్‌ 9000, సీక్రెట్‌ సూపర్‌స్టార్‌ 12000, బాహుబలి 6000 థియేటర్‌లలో విడుదల కాగా, 'లడ్‌కీ' చిత్రం మాత్రం 40000 థియేటర్‌లలో విడుదల కానుంది. తద్వారా ఇండియన్‌ సినిమా చరిత్రలోనే ఇంత భారీస్థాయిలో రిలీజ్‌ చేయడం మొదటిసారి కావడం విశేషం.  
 
ఇందులో కథానాయిక పాత్రధారి పూజా బాలేకర్‌ టైక్వాండో నేషనల్‌ ఛాంపియన్‌. అయినప్పటికీ ఈ చిత్రానికి గానూ చైనాలోని షావోలిన్‌ టెంపుల్‌లో శిక్షణ తీసుకున్న నిపుణుల పర్యవేక్షణలో బ్రూస్‌లీ స్టైల్‌ అయినటువంటి జీత్‌ కునేడోలో ట్రైనింగ్‌ ఇచ్చారు. 'బ్రూస్‌లీ పట్ల నాకున్న అభిమానంతో తీసిన చిత్రమిది. రెండు దశాబ్ధాల కల ఇది'' అని ఆర్‌జీవీ ట్వీట్‌ చేశారు.