శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 14 ఫిబ్రవరి 2019 (13:43 IST)

ట్రయిలర్‌లో చూపించిందే అపుడు జరిగింది : లక్ష్మీపార్వతి

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్". ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారం ఉదయం విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను స్వర్గీయ ఎన్.టి.రామారావు భార్య లక్ష్మీపార్వతి వీక్షించారు. ఆ తర్వాత ఆమె తన స్పందనను తెలియజేశారు.
 
ఈ ట్రైలర్‌ చూసిన తర్వాత కళ్ళలో నుంచి తనకు తెలియకుండానే నీరు వచ్చింది. ఇదే ఈ ట్రైలర్‌పై నా స్పందన అని చెప్పింది. ట్రయిలర్‌లో చూపినంత వరకూ ప్రతి సన్నివేశాన్నీ వాస్తవంగా తీశారు. ప్రతి సన్నివేశం... ఏదీ నేను మరిచి పోలేదని వెల్లడించారు. 
 
ముఖ్యంగా, "నా జీవితంలో జరిగింది. 23 ఏళ్లు అయినా... ప్రతిక్షణం, ప్రతిమాట, ప్రతి చర్యా గుర్తుంది నాకు. అవి గుర్తున్నాయి కనుకనే నేనీ విధంగా నిలబడివుండగలిగాను. నిజంగా వర్మగారికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. నిజంగా నన్నేమీ సంప్రదించలేదు. నన్ను ఆయన కలవలేదు. కనీసం మీరేమైనా చెబుతారా? అని నన్ను అడగలేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.