ఒకేసారి రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ హీరో

Lakshmis Veeragrandham
Last Updated: శుక్రవారం, 15 మార్చి 2019 (09:52 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకే రోజు ఒకే హీరో‌కి సంబంధించిన రెండు సినిమాలు కావడం చాలాచాలా అరుదు. ప్రస్తుతం పరిస్థితులలో ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే విడుదల చేస్తున్న తరుణంలో యంగ్ హీరో రామ్ కార్తిక్ ఒకే రోజున రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయన నటించిన 'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి', 'మౌనమే ఇష్టం' చిత్రాలు మార్చి 15వ తేదీ శుక్రవారం విడుదల కానున్నాయి.

రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో రామ్ కార్తిక్ హీరో‌గా కిషోర్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న హారర్ కామెడీ చిత్రం వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మిపై ఇప్పటికే మంచి అంచనాలుండగా, మౌనమే ఇష్టం లాంటి యూత్‌ఫుల్‌ లవ్ ఎంటర్‌టైనర్‌ చిత్రంగా వస్తున్న ఈ సినిమా పై కూడా భారీ అంచనాలున్నాయి.

దాదాపు 150 సినిమాలకుపైగా ఆర్ట్‌ డైరెక్టర్‌గా పని చేసి, ఐదు నంది అవార్డ్స్‌ గెలుచుకున్న అశోక్‌ కుమార్‌ తొలిసారి 'మౌనమే ఇష్టం' సినిమాకు దర్శకత్వం వహిస్తుండడం విశేషం.. ఇక టీజర్, ట్రైలర్‌తో విశేష స్పందన దక్కించుకున్న వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి‌లో రామ్ కార్తీక్ సరసన పూజిత పొన్నాడ నటించగా , మౌనమే ఇష్టం సినిమాలో రామ్ కార్తీక్ సరసన పార్వతి అరుణ్, రీతూచౌదరి హీరోయిన్లుగా నటించారు.దీనిపై మరింత చదవండి :