ఆకట్టుకునే కథలతో ప్రైమ్ వీడియోను ముందంజలో వుంచుతా : సౌత్ హెడ్ పద్మా కస్తూరిరంగన్
సౌత్, ఇండియా ఒరిజినల్స్, ప్రైమ్ వీడియో హెడ్‌గా పద్మా కస్తూరిరంగన్ పదోన్నతి పొందారు. ఆమె రెండు సంవత్సరాల క్రితం ప్రైమ్ వీడియోలో చేరారు. అప్పటి నుండి అద్భుతమైన తెలుగు కంటెంట్ వున్న స్లాట్ లను రూపొందించడానికి కొంతమంది ఉత్తమ క్రియేటర్ తో కలిసి పని చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
Annpurna studio team with padma
న్యూయార్క్ యూనివర్శిటీలో ఫిల్మ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత, పద్మ హైదరాబాద్‌లో అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తరువాత టమాడ మీడియాలో లాంగ్ ఫారమ్ వింగ్‌కు అధిపతిగా మారింది, అక్కడ ఆమె అనేక ప్రాంతీయ చిత్రాలకు సంబంధించి కంటెంట్, స్లాట్లలో తన ముద్ర చూపారు. అదేవిధంగా అమెజాన్ ప్రైమ్ వీడియోకి వెళ్లడానికి ముందు ఆమె తెలుగు ఒరిజినల్స్ కు సంబంధించిన జీ5లో కూడా పనిచేశారు.
ప్రైమ్ వీడియోలో ఆమె సమీప భవిష్యత్తులో ప్రారంభించబోతున్న షోలు, సినిమాల మొత్తం స్లాట్ లను అభివృద్ధి చేస్తూ, ఇటీవలి అద్భుతమైన హిట్ “రానా దగ్గుబాటి షో”ని సృష్టించింది.
ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ, సమీప భవిష్యత్తు కోసం సూపర్ థ్రిల్లింగ్ లైనప్ ప్లాన్ చేయడంతో, మా ఒరిజినల్స్ ప్రోగ్రామ్‌ను తమిళం, తెలుగులో పెంచాలని నేను ఎదురు చూస్తున్నాను, ఈ విస్తరించిన పాత్రలో మా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి మరియు ఆహ్లాదపరిచేలా స్ళాయిని పెంచే కథనాలను తీసుకువస్తున్నాను. ప్రైమ్ వీడియోలో నా ప్రయాణంలో కొత్త మార్కెట్‌లను పెంపొందించడం, విభిన్నమైన, సంపూర్ణమైన కంటెంట్ స్లాట్‌ను రూపొందించడం అనేది నా ప్రయాణంలో అత్యంత ప్రతిఫలదాయకమైన అంశాలలో ఒకటి. ఈ అవకాశాన్ని నాకు అప్పగించినందుకు నిఖిల్ మధోక్, గౌరవ్ గాంధీ, జేమ్స్ ఫారెల్‌లకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను దక్షిణ భారతదేశంలోని మార్కెట్‌ల కోసం ముందుకు సాగుతున్న వాటి గురించి థ్రిల్‌గా ఉన్నాను. కనుక మరింత ఆకట్టుకునే కథలు, మరపురాని పాత్రలను అభివృద్ధి చేయడానికి ఆసక్తిగా ఉన్నాను అని తెలిపారు.