మరోసారి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను: తమన్నా

Chiru-Tamanna
మనీల| Last Modified శనివారం, 12 అక్టోబరు 2019 (15:58 IST)
అక్టోబర్ 2న విడుదలైన 'సైరా' చిత్రంలో తమన్నా ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ చిత్రం తనకు ఎంతో క్రేజ్ తీసుకోవచ్చింది. బాహుబలిలో నటించినా తనకు అంతగా పేరురాలేదు. అందులో తన పాత్ర అంతగా ప్రధానం లేదు. కాని సైరా సినిమా భారీ విజయాన్ని సాధించడంతో ... తన పాత్రకి మంచి పేరు రావడంతో ఆమె ఫుల్ ఖుషీ అవుతోంది.

తెలుగు ఆనందోబ్రహ్మ చిత్రం తమిళంలో రిమేక్‌‌‌లో హిరోయిన్ తాఫ్సీ పాత్ర మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. ఈ చిత్రం 'పెట్రోమ్యాక్స్' గా
నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

తాజా ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ ఇళయ దళపతి హీరో విజయ్ ప్రస్తావన వచ్చింది. అప్పుడామె మాట్లాడుతూ .. "చాలా కాలం క్రితం విజయ్‌‌‌తో కలిసి 'సుర' సినిమాలో నటించాను. ఆ సినిమాలో నా పాత్ర చాలా చిన్నది. పాటల షూటింగు సమయంలోను సెట్‌‌‌‌కి వచ్చేసి డాన్సులు చేసేసి వెళ్లిపోయేదానిని. అప్పటికే విజయ్ పెద్ద స్టార్ కావడం వలన ఎక్కువగా మాట్లాడేదానిని కాదు. ఆయనతో మరోసారి జోడీ కట్టాలని వుంది. మరోసారి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.
దీనిపై మరింత చదవండి :