ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (18:36 IST)

అంతే... తగ్గేదేలే అంటోన్న మాధవీలత.. (video)

సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన పుష్ప సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. పుష్పరాజ్‌గా డిఫరెంట్ లుక్‌లో అల్లు అర్జున్, అతడికి జోడీగా శ్రీవల్లి పాత్రలో రష్మిక, విలన్‌గా సునీల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసింది. ఈ పాట పురుషులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం ఆ పాట పురుషులను కించపరిచేలా వుందనేదే. అయితే ఈ పాటపై సినీనటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది.

 
ఆ పోస్టులో "వాయమ్మో పుష్ప మూవీ సాంగ్ మీద కేస్ అంటగా. ఈ లెక్కన ఇండస్ట్రీలో 98 శాతం పాటలు అలానే ఉంటాయి. సాంగ్స్ లేని మూవీ చెయ్యాలి. నేను కూడా అమ్మాయిల మీద రాసే పాటలకి కేసులు పెడతా. పుష్పలోని రారా సామీ సాంగ్ మీద కేసు వేస్తా.


ఏంటీ ఒక అమ్మాయికి మగాడిని చూస్తే.. అతను పోలిస్తే అంత చులకనగా వెంటపడి వెళ్లిపోద్దా? అబ్బాయి నడిచినచోట భూమిని మొక్కుతుందా? ఒక మహిళ పరువు పోయింది. ఛ నాకు నచ్చలే. నేను పెడతా కేసు. అంతే తగ్గేదేలే" అంటూ పోస్ట్ పెట్టింది.