సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By జె
Last Modified: బుధవారం, 15 డిశెంబరు 2021 (18:47 IST)

యాక్షన్ సినిమాలే వస్తున్నాయి, ప్రేమ కథలు రావడం లేదు, హీరో ఆవేదన

భిక్షగాడు..ఈ సినిమా అటు తమిళంలోను, ఇటు తెలుగులోను ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. విజయ్ ఆంటోనికి మంచి పేరే తెచ్చిపెట్టింది. అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా ఆ ఒక్క సినిమానే ఆయన్ను తమిళ సినీ పరిశ్రమలో అగ్రస్థానంలో నిలిపింది.

 
ఈ నేపథ్యంలో తాజాగా విక్రమ్ రాథోడ్ సినిమాలో నటించారు విజయ్ ఆంటోని. తమిళం, తెలుగులోను ఒకేసారి విడుదల అవుతోంది. తిరుమల శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో పాటకు సంబంధించిన ఆడియో లాంచ్ జరిగింది.

 
హీరోతో పాటు సినిమా యూనిట్ మొత్తం తిరుపతికి చేరుకుంది. మొత్తం 5 పాటలను రిలీజ్ చేశారు. అట్టహాసంగా జరిగిన కార్యక్రమానికి అతిరథమహారథులందరూ హాజరయ్యారు. అయితే ఈ ఆడియో లాంచ్‌ సందర్భంగా హీరో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 
చేసే సినిమాలన్నీ సస్పెన్స్, థ్రిలర్స్ వస్తున్నాయి. ఎప్పుడూ గొడవలే.. ప్రేమకథలు రావడం లేదు. ఏం చేయమంటారు. ప్రస్తుతం నటించిన విక్రమ్ రాథోడ్ సినిమా ఫైట్స్.. నేను త్వరలో నటించబోయే సినిమాలు మొత్తం ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి. అవి కూడా సస్పెన్స్ థ్రిల్లర్లే. 

 
ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి. ప్రేమ కథలు రాయడం లేదు. నన్ను చూస్తే ప్రేమకథ రాయాలని రచయితలకు అనిపించడం లేదేమో అంటూ ఆవేదనగా అన్నారు హీరో విజయ్ ఆంటోని. 

 
అయితే తాను నటించి విక్రమ్ రాథోడ్ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని.. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ద్వారా తనను ఆదరించాలని కోరారు. తిరుపతిలోని ఒక ప్రైవేటు హోటల్లో ఆడియో ఫంక్షన్ జరిగింది.