గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జూన్ 2022 (19:14 IST)

''వరుడు''లో ఐటెం సాంగ్ ఛాన్స్ వచ్చింది.. వరలక్ష్మిలా నటించాలనుంది..

Madhavi latha
రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన నచ్చావులే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు నటి మాధవీలత.  అవకాశాలు అంతగా లేకపోవడంతో సినిమాలకు దూరంగా వుంటున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్న ఈమె సినిమాలలో నటించకపోయినా సినిమా ఇండస్ట్రీ గురించి సోషల్ మీడియా వేదికగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు 
 
తాజాగా ఓ ఇంటర్వ్యలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం కల్పించారు. అయితే ఆ సమయంలో తాను వేరే సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈ పాటలో నటించలేక పోయానని ఈ పాట కోసం ఐదు లక్షల రెమ్యూనరేషన్ చెల్లిస్తామని తెలిపినట్లు ఈమె వెల్లడించారు. ఈ సినిమా అనంతరం తనకు పలు సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసే అవకాశం వచ్చినా తాను ఐటమ్ సాంగ్స్ చేయడానికి ఇష్టపడలేదని తెలిపారు. 
 
అయితే తనకు విలన్ పాత్రలో నటించాలని చాలా ఆసక్తిగా ఉందని నటి వరలక్ష్మి నటిస్తున్నటువంటి పాత్రలలో విలన్‌గా నటించాలని ఆసక్తి ఉందని మాధవీలత వెల్లడించారు.