బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (13:34 IST)

న‌వ‌ర‌సాలు పండించే ద‌ర్శ‌కుల‌తో మ‌ణిర‌త్నం `న‌వ‌ర‌స‌`

Mani ratnam
మ‌ణిర‌త్నం ద‌ర్శ‌కుడిగా నాలుగు ద‌శాబ్దాలుగా వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ రంగాల‌కు ఆయ‌న పేరు తెలియ‌నివారు వుండ‌రు. ఆయ‌న జ‌న్మ‌దినం జూన్ 2. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నిర్మాత‌గా ఓ వెబ్ సిరీన్ ను నిర్మిస్తున్న విష‌యాన్ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే దానిపై వార్త‌లు వ‌చ్చాయి. ఒక‌సారి ఆయ‌న కెరీర్‌ను ప‌రిశీలిస్తే ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు విదితం అవుతాయి.
 
తొలి నాళ్ళ‌లో మ‌ణిర‌త్నం ఏమీ పెద్ద ద‌ర్శ‌కుడుకాదు. వ‌రుస‌గా నాలుగు సినిమాలు ప‌రాజ‌యం పాల‌య్యాయి. త‌న ఆలోచ‌న‌ల‌కు ప్రేక్ష‌కులు ఇంకా రీచ్ కాలేదేమోన‌ని అనేవారు. ఆ త‌ర్వాత 1986లో వ‌చ్చిన `మౌన‌రాగం` ఆయ‌న కెరీర్‌ను మార్యేసింది. మోహ‌న్ హీరోగా న‌టించిన ఈ సినిమా త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో విడుద‌లై మంచి క్రియేటివ్ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ఆయ‌న విభిన్న‌మైన అంశాల‌ను వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌ను క‌థా వ‌స్తువుగా మ‌లుచుకున్నారు. అలా నాయ‌కుడు, ఘ‌ర్ష‌ణ‌, గీతాంజ‌లి, అంజ‌లి, ద‌ళ‌ప‌తి, రోజా సినిమాలు ఒక‌దానికి మించి మ‌రోటిగా ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్నాయి. ఆ సినిమాల‌కు ఆయ‌న పేరు ప్ర‌ఖ్యాతులు వ‌చ్చాయి. అవార్డులు, రివార్డుల‌తోపాటు అంత‌ర్జాతీయ గుర్తింపు ద‌క్కింది. ఆయ‌న టేకింగ్‌ను ప్రేక్ష‌కులతోపాటు ఔత్సాహిక ద‌ర్శ‌కులు కూడా ఫిదా అయిపోయారు. వారు ఆయ‌న్ను ప్రేర‌ణ‌గా తీసుకునేవారు.
 
Navarasa poster
నాలుగు ద‌శాబ్దాల‌పాటు అల‌రించిన మ‌ణిర‌త్నం తాజాగా పాన్ ఇండియా స్థాయిలో పొన్నియ‌న్ సెల్వ‌న్ అనే త‌మిళ సినిమా చేప‌ట్టారు. అది హిస్టారిక‌ల్ నేప‌థ్యంలో వుంటుంది. ఇప్ప‌టికే దీనిపై క్రేజ్ ఏర్ప‌డింది. ఇందులో విక్ర‌మ్‌, కార్తీ, జ‌యంర‌వి, ఐశ్వ‌ర్యా రాజేష్‌, త్రిష వంటి భారీతారాగ‌ణం న‌టిస్తున్నారు. దీనితో నైనా ఆయ‌న మంచి పేరు తెచ్చుకుంటార‌ని కోలివుడ్‌ ఆశిస్తోంది. ఇక తాజాగా ఆయ‌న ఓ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. దీనికి `న‌వ‌ర‌స‌` అని పేరు పెట్టారు. ఇందులో న‌వ‌ర‌సాలు పండించే న‌వ ద‌ర్శ‌కులు న‌టించ‌డం విశేషం. దీని గురించి త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.