తెలుగులో కూడా దుమ్మురేపుతున్న మాస్టర్ టీజర్..

Master Teaser
Master Teaser
సెల్వి| Last Updated: శుక్రవారం, 18 డిశెంబరు 2020 (12:57 IST)
తెలుగులో కూడా మాస్టర్ టీజర్ దుమ్మురేపుతోంది. ఇంతకుముందు టాలీవుడ్‌లో విడుదలైన విజయ్ ప్రతి సినిమా నిరాశను మిగిల్చాయి. అయితే విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమాను రూపొందించాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక్కసారి థియేటర్లు తెరుచుకుంటే సినిమా విడుదల అవుతుంది. ఈ సినిమా టీజర్ అనేక రికార్డులను తన పేరిట చేసుకున్న సంగతి తెలిసిందే.

అయిత ఆ రికార్డులన్నీ కూడా కేవలం తమిళ భాషలోని టీజర్‌వే. ఇటీవల మాస్టర్ టీజర్‌ను తెలుగులో విడుదల చేశారు. ఈ టీజర్ తెలుగులోనూ మంచి ఆదరణ పోందింది. మరి ఈ సినిమాతోనైనా విజయ్ తెలుగులో మంచి మార్కెట్ సంపాదిస్తాడేమో చూడాలి. ఒకవేళ ఈ సినిమా తెలుగులో కూడా హిట్ అయితే విజయ్‌కు తెలుగులో మొట్టమొదటి హిట్ సినిమాగా మాస్టర్ నిలుస్తుంది. మరి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో వేచి చూడాలి.దీనిపై మరింత చదవండి :