నాకు మరో తమ్ముడు దొరికాడన్న చిరు. ఇంతకీ ఆ తమ్ముడు ఎవరు..?  
                                       
                  
				  				  
				   
                  				  మెగాస్టార్ చిరంజీవికి తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ అయినప్పటికీ.. ఆయన్ని అన్నయ్య అని పిలిచే అభిమాన తమ్ముళ్లు ఎంత మంది ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే.. చిరంజీవి తనకు మరో తమ్ముడు.. శిష్యుడు ఉన్నాడని తెలిసింది అంటూ సంతోషం వ్యక్తం చేసారు. ఇంతకీ విషయం ఏంటంటే... యువ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం.
				  											
																													
									  
	 
	ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ  వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో నిఖిల్ గురించి చిరు మాట్లాడుతూ...ఈ విధంగా స్పందించారు. 
				  
	 
	నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమాని చూశాను. బాగా నచ్చింది.  ఈ తరం చూసి, తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో ఉన్నాయన్నారు.  చెగోవెరాకి సంబంధించిన పాట చూస్తున్నప్పుడు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడన్నారు.
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	ఈ విధంగా నిఖిల్ గురించి.. అర్జున్ సురవరం సినిమా గురించి చిరు స్పందించి సినిమా పై ఇంట్రస్ట్ క్రియేట్ చేసారు. ఈ నెల 29న అర్జున్ సురవరం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా ఇన్నాళ్లకు రిలీజ్ అవుతుంది. మరి... నిఖిల్ కి విజయాన్ని అందిస్తుందో లేదో..?