బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జులై 2022 (14:33 IST)

నెట్టింట వైరల్ అవుతున్న మెగా ఫ్యామిలీ ఫోటో

Ramcharan
Ramcharan
మెగా కోడలు ఉపాసన కొణిదెల పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి పోస్టు చేసిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. జూలై 20న ఆమె పుట్టిన రోజు కావడంతో ఆమెకు నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 1989లో జన్మించిన ఆమె నేడు తన 33వ బర్త్ డేని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. 
 
ఈ సారి తన బర్త్ డే తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్‌ చేసుకుంది ఉపాసన. మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, భర్త రామ్‌చరణ్‌లతో కలిసి బర్త్ డే జరుపుకుంది. 
 
ఈ సందర్భంగా ఫ్యామిలీ ఫోటోని పంచుకుంటూ బర్త్ డే విషెస్‌ తెలిపారు రామ్‌చరణ్‌. ఇక చరణ్‌ పంచుకున్న ఫ్యామిలీ ఫోటో ఎంతో బ్యూటీపుల్‌గా ఉండటం విశేషం. చిరంజీవి, సురేఖ, చరణ్‌, ఉపాసన పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 
 
మరోవైపు చిరంజీవి సైతం కోడలు ఉపాసనకి బర్త్ డే విషెస్‌ తెలిపారు. "మా ఇంటి కోడలు పిల్ల ఉపాసనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు" అని ట్విట్టర్‌ ద్వారా విషెస్‌ తెలిపారు. అపోలో ఆసుపత్రుల మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్న ఉపాసన ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో భాగమవుతుంది. 
 
ఆదివాసులు, గిరిజనులతోనూ మమేకమవుతూ ప్రజల హృదయాలను గెలుచుకుంటుంది. అదే సమయంలో అపోలో ఆసుపత్రుల ద్వారా తనవంతు సేవని అందిస్తూ ముందుకు సాగుతుంది. కెరీర్‌ పరంగా ఓ పెద్ద సంస్థలో టాప్‌ పొజిషియన్‌లో ఉంటూనే మరోవైపు ఇల్లాలిగా మెగా ఫ్యామిలీలో ఒదిగిపోతుంది ఉపాసన.