గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 20 జులై 2022 (16:26 IST)

ఎ.సి.ఎఫ్ వెబ్ సైట్ ప్రారంభించిన త‌ల‌సాని

Thalasani Srinivas Yadav, chiru fans
Thalasani Srinivas Yadav, chiru fans
చిరంజీవి ఠాగూర్ సినిమాలో ఎ.సి.ఎఫ్‌. అనే ప‌దం గురించి తెలిసేవుంటుంది. యాంటీ క‌రెప్ష‌న్ ఫోర్స్‌.. లాగానే చిరంజీవి అభిమానులు ఈరోజు (20/07/2022) "అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ (ఎ.సి.ఎఫ్)" వెబ్సైట్ ను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా "ఎ.సి.ఎఫ్" వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రాజపాలెం శ్రీనివాసులు గారు మాట్లాడుతూ మంత్రి గారి చేతులమీదుగా వెబ్సైట్ ఆవిష్కరణకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన లడ్డు, సయ్యద్ గార్లకు కృతఘ్నత లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు యర్రా శ్రీనివాస్, కసపు గోవిందు, మహేష్ (నల్గొండ), రాజేష్, మహేష్ (భువనగిరి), ప్రవరాఖ్య, సాయి, ఆది నాయక్, బాబ్జీ పాల్గొన్నారు.
ఈ వెబ్‌సైట్‌లో మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ యాక్టివిటీస్‌తోపాటు సినిమాల గురించి ప‌లు విష‌యాలు పొందుప‌ర్చ‌నున్నారు.