బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ ట్రెండ్!

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. మల్టీ స్టారర్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో దర్శక నిర్మాతలు స్టార్ హీరోలతో ప్రయోగాలు చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న "ఆర్ఆర్ఆర్" అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. 
 
ఈ సినిమాలో జూనియర్ కొమురం భీం పాత్రలో కనిపించి అలరించనున్నాడు. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించి విడుదలైన లుక్స్ ఆకట్టుకున్నాయి.
 
దక్షిణాది నుంచి దిమ్మతిరిగే మరో మల్టీ స్టారర్ రాబోతుంది అని గాసిప్స్ మొదలు కాగా, ఇందులో దళపతి విజయ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రలు పోషించనున్నారట. 
 
తమిళ దర్శకుడు అట్లీ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కాని, ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయం. కాగా, ఎన్టీఆర్ త్వరలో కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు, పరశురాం దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు.