నా భీమ్ బంగారం, పోరాటంలో ధైర్యవంతుడు రాజమౌళి
ఎప్పుడెప్పుడా అంటూ ఊరిస్తున్న ఎన్.టి.ఆర్. తాజా స్టిల్ `ఆర్.ఆర్.ఆర్.` సినిమా గురించి ఈరోజే వచ్చేసింది. ఎన్.టి.ఆర్. పుట్టినరోజు సందర్భంగా గురువారం పగలు 10 గంటలకు చిత్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ట్విట్టర్‌లో విడుదల చేశాడు. బల్లెం పట్టుకున్న భీమ్ ఆకట్టుకున్నాడంటూ.. నా భీమ్ బంగారు హృదయం కలవాడు. అతను తిరుగుబాటు చేస్తే బలంగా ధైర్యంగా నిలుస్తాడు. అరాచకాలను ఎదురొద్దుతాడు.. అంటూ తన సినిమాలో ఎన్.టి.ఆర్. పాత్ర గురించి కొటేషన్ పెట్టాడు.
చాలా ఆనందంగా వుందిః ఎన్‌టిఆర్
కొమరం భీమ్ వంటి పవర్‌ఫుల్ పాత్రను పోషించడం చాలా ఆనందంగా ఉంద. ఇప్పటివరకు నాకున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటైన భీమ్ పాత్రను పోషించడం ఆ స్టిల్‌ను మీ అందరికీ పరిచయం చేయడం ఆనందంగా ఉంది.
ఇక అభిమానులు ఎంతో ఊహించుకున్న తన అమభిమాన హీరో ఎన్.టి.ఆర్. స్టిల్ చూసి ఫిదా అయిపోయారనే చెప్పాలి. అయితే దీన్ని మోషన్ పోస్టర్‌గా కూడా విడుదల చేయనున్నారు. ఇక సినిమా కరోనా వల్ల షూటింగ్ ఆగిపోయింది. ఎన్.టి.ఆర్.కు కరోనా కూడా సోకడంతో ప్రస్తుతం ఐసొలేషన్‌లో వున్నారు. ఈ ఉయదమే ఆయనకు కుటుంబసభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. తన పిల్లలతో హాపీగా ఫోన్‌లో మాట్లాడి ఆనందాన్ని పంచుకున్నారు. ఇంకేం త్వరలో కోలుకుని బయటకు రానున్నాడు ఈ కొమరం భీమ్.