మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (16:29 IST)

చార్లీ చాప్లిన్ లుక్ లో మెరిసిన నభా నటేష్

Nabha Natesh
టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో నభా నటేష్ ఒకరు. నన్ను దోచుకుందువటే, ఇస్మార్ట్ శంకర్,‘‘సోలో బ్రతుకే సో బెటర్’’ సినిమాల్లో గ్లామరస్ రోల్స్ లో ఆకట్టుకున్న నభా తాజాగా మాస్ట్రో సినిమాలోనూ తన అందంతో ఫ్యాన్స్ ను అలరించింది. ఇక నభా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోవర్స్ కి కనువిందు చేస్తుంది. ఎప్పుడూ గ్లామర్ షూట్స్ చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇందుకు భిన్నమైన ఫోటో షూట్ చేసింది.
 
అందులో నభా నటేష్ చార్లీ చాప్లిన్ అవతారమెత్తింది. ఫన్నీగా ఉన్న నభా చార్లీ చాప్లిన్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భిన్నమైన ఈ గెటప్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇది ఏదైనా సినిమాలోనిదా! కాజువ‌ల్‌గా పెట్టిందా! అని అడుగుతుంటే నో కామెంట్ అంటూ త‌ప్పించుకుంది.