బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 21 జులై 2022 (18:04 IST)

తెలుగులో నాగ‌చైత‌న్య త‌మిళ‌లో ధ‌నుష్ - సి.పి. శ్రీ‌రామ్‌

P. C. Sriram
P. C. Sriram
నేను మొద‌ట థ్యాంక్స్ చెప్పాలంటే మొద‌ట మా అమ్మ‌నాన్న‌ల‌కు చెబుతాను అని పి.శ్రీ‌రామ్ అన్నారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ్ పి.సి. శ్రీ‌రామ్ ప‌నిచేసిన సినిమా `థ్యాంక్యూ`. నాగ‌చైత‌న్య మూడు షేడ్స్‌లో క‌నిపిస్తాడు. ఇందుకు ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ కృషి అభినంద‌నీయ‌మ‌ని పి.సి. శ్రీ‌రామ్ తెలిపారు. ఈ సినిమా ఈనెల 28న విడుద‌ల‌కాబోతోంది. గురువారంనాడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, నాగ‌చైత‌న్య‌ను అభినందిస్తున్నానంటే అందుకు కార‌ణం.. స్కూల్‌డేస్ నుంచి మ‌ధ్య వ‌య‌స్సుగ‌ల‌వాడిగా చేసిన షేడ్స్ నాకు న‌చ్చాయి. త‌మిళంలో అలా ఒదిగిపోయేలా చేసేది ధ‌నుష్ ఒక్క‌డే.
 
- నేను పెద్ద ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కే అందుబాటులో వుంటాన‌నేది అవాస్త‌వం. ఇదంతా మాయాలోకం. నా ద‌గ్గ‌ర పెద్ద‌, చిన్న సినిమాలు అంతా ఒక్క‌టే. క‌ష్టం ఒక్క‌టే. కానీ నా ద‌గ్గ‌ర వ‌చ్చేవారు త‌క్కువ‌. నేను సినిమా చేయాలంటే పూర్తి క‌థ‌ను అడుగుతాను. అది న‌చ్చితేనే సినిమా చేస్తాను.
- మారుతున్న టెక్నాల‌జీ వ‌ల్ల సినిమాటోగ్రాఫ‌ర్‌కు ఐడియాలు పెరిగాయి. వినూత్నంగా చేయాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది.
- ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో అమితాబ్ సినిమా చేస్తున్నాం. త‌మిళ‌, మ‌ల‌యాళం చిత్రాల్లో ప‌నిచేస్తున్నాను అని తెలిపారు.