గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2019 (15:03 IST)

బిగ్ బాస్ డైరక్షన్‌లో నాగార్జున యాక్షన్.. ఆ విమర్శలు నిజమేనా?

బిగ్ బాస్ మూడో సీజన్‌ చివరి దశకు చేరుకుంది. ఈ షోకు అక్కినేని నాగార్జున బిగ్ బాస్ తర్వాత కొత్త సినిమా స్క్రిప్ట్‌పై కన్నేశాడు. ఇప్పటివరకు ఆయన ఏ సినిమా ఒప్పుకోలేదు. నాగార్జున తాజాగా నటించినటువంటి చిత్రం మన్మథుడు 2 ఫట్ కావడంతో తదుపరి సినిమా వ్యవహారంలో నాగార్జున ఆచీతూచీ అడుగులేస్తున్నారు. 
 
అయితే ఈ సందర్భంగా ఎవరైనా సరే కొత్తగా కథలు చెప్పడానికి వస్తే మాత్రం తాను హోస్టుగా వ్యవహరిస్తున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం అయ్యేవరకు ఆగాల్సిందిగా ఇప్పటికే చెప్పేశారు. కానీ మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ ఫైనల్ కూడా పూర్తవనుంది. దానికి ఇంకా సమయం ఉండటంతో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా చూసుకోవాలని నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. 
 
అయితే నాగార్జున హోస్టు పై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. తానూ కేవలం స్క్రిప్ట్ ఫాలో అవుతున్నాడని, అంతేకాని నాగార్జున ఎలాంటి ఎపిసోడ్ చూడలేదని చెప్తున్నారు. ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నాగార్జున మాట్లాడుతున్నారని.. ఇందులో నాగ్ స్వతహాగా చేసిన కామెంట్లు, ఆదేశాలు లేవని.. అంతా బిగ్ బాస్ డైరక్షన్‌లో నాగార్జున యాక్షన్ చేస్తున్నారని టాక్ వస్తోంది. మరి ఈ వార్తలపై నాగార్జున ఏ మేరకు స్పందిస్తాడో వేచి చూడాలి.